Krithi Shetty: బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ తేజ్(Vaishnav Tej) హీరోగా తరకెక్కిన “ఉప్పెన”(Uppena) సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి(Krithi Shetty).. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. మొదటి సినిమా అయినా గాని రొమాంటిక్ గా మరియు ఎమోషనల్ సన్నివేశాలు పండించడంలో స్క్రీన్ మీద తన మార్క్ నటన చూపించింది. దీంతో ఈ సొట్ట బుగ్గ సుందరి.. సౌత్ ఇండియాలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఒకపక్క తమిళంలో చేస్తూ మరోపక్క తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.
తాజాగా ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) తమిళ దర్శకుడు లింగస్వామి(Lingu Swamy) దర్శకత్వంలో చేసిన “దీ వారియర్”(The Warrior) సినిమాలో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న కృతి శెట్టి… ఇటీవల ఇంటర్వ్యూలో తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charantej) తో చేయాలని తన డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చింది.
అంత మాత్రమే కాదు రామ్ చరణ్ సూపర్ క్యూట్ గా ఉంటాడని, మహేష్ బాబు అయితే ఇంకా చాలా హ్యాండ్సంగా ఉంటాడని ఇద్దరు హీరోలను కృతి శెట్టి పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ తో చేసిన “ది వారియర్” ఈనెల 14వ తారీఖున విడుదల కానుంది. తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య సరసన కృతి శెట్టి రెండోసారి నటిస్తోంది. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో “బంగార్రాజు”(Bangarraju) చిత్రం రావటం జరిగింది. మరోసారి వీరిద్దరూ కలిసి నటించిన సంచలనంగా మారింది.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…