Kruthi: హీరో, హీరోయిన్లు విషయానికొస్తే జిమ్ చేయనిదే వారికి రోజు గడవదు. ఎందుకంటే వారి శరీరమే సినిమాకు పెట్టుబడి కనుక. ఫిట్ గా లేరంటే వారికి సినిమా అవకాశాలు రావు సరికదా ప్రేక్షకుడే వారిని చూడటానికి ఇష్టపడడు. అందుకే వారు రేయింబవళ్లు షూటింగులతో బిజీగా వున్నా, ఏదోఒక టైం చూసుకొని జిమ్ చేస్తూ వుంటారు. ఇక పొతే సోషల్ మీడియా స్థాయి పెరిగిన తరువాత వీరు ఏది చేసినా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో వారు జిమ్ చేసిన వీడియోలు అనేకం దర్శనం ఇస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఒకటి నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ ‘తీన్మార్’ సినిమాలో నటించిన కృతి కర్భందా వీడియో ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదే ఆ వైరల్ వీడియో:
తాజాగా కృతి షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇది పోస్ట్ చేస్తూ… “చూసేందుకు ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నా కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చే ఎక్సర్ సైజ్” అని కృతి టెక్స్ట్ చేసింది. ఈ వీడియోని ఫాలో చేస్తూ ఇలా ట్రై చేస్తే ఒత్తిడిని అధిగమించొచ్చని కూడా వెల్లడించింది. ఇకపోతే, తాజాగా కృతి ఓ ప్రముఖ పబ్లికేషన్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి పనిచేయాలన్న తన కోరికను వెళ్లబుచ్చింది. ఖాన్ లతో కలిసి పనిచేయడం నా చిరకాల కోరిక అని తెలియజేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరింత సమాచారం:
ఇకపోతే, కృతి చివరిగా 14 ఫేరేలో విక్రాంత్ మాస్సేతో కలిసి కనిపించింది. కానీ ఆ సినిమా తనకు ఆశించిన హిట్టివ్వలేదు. నిజానికి కృతి అంతకుముందే బాలీవుడ్ లో విక్రమ్ భట్ హర్రర్ థ్రిల్లర్ రాజ్ రీబూట్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఇమ్రాన్ హష్మీ – గౌరవ్ అరోరా నటించారు. తర్వాత గెస్ట్ ఇన్ లండన్- షాదీ మే జరూర్ ఆనా – పాగల్ పంథి వంటి కొన్ని చిత్రాలలో నటించింది. ఇక కృతి ఇటీవల సోషల్ మీడియాల్లో కాస్త స్పీడ్ పెంచింది. ఈ వేదికపై అప్పుడప్పుడు ఫిట్ నెస్ టిప్స్ కి ఉపకరించే కొన్ని వీడియోలను కృతి షేర్ చేస్తోంది.