బిగ్ బాస్ 4 : కుమార్ సాయి బయటకు వచ్చి ఆమెను ఎంత బ్యాడ్ చేసేశాడో చూడండి..! 

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అనూహ్య పరిస్థితుల్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంటి లోనికి ప్రవేశించిన కుమార్ సాయి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలిమినేషన్ ప్రక్రియ సజావుగా సాగడం లేదంటూ జనాల్లో వస్తున్న ఆగ్రహం మధ్య కుమార్ సార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకొని కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. 

 

ముఖ్యంగా అతను దేత్తడి హారిక ఫోటో చూసి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆమె తనకంటూ కొంత మందిని ఆసరాగా ఉంచుకొని ఒక గ్రూప్ లాగా టార్గెట్ చేస్తుందని చెప్పాడు. అలాగే నోయల్ తో ఫ్రెండ్ షిప్ పెట్టుకొని అతడిని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటుంది అని అన్నాడు. ఇక హారిక ప్రభావితం చేయడం వల్లనే అభిజిత్ కూడా తనను నామినేట్ చేశాడని…. ఇదే విషయంలో అభిజిత్ తన తప్పును ఒప్పుకున్నట్లు కూడా కుమార్ సాయి వెల్లడించాడు. 

అలాగే హారిక.. నోయల్ కు, తనకు పడడం లేదన్న కారణంతోనే తనను నామినేట్ చేసిందని…. కానీ నాకు, నోయల్ కి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని పేర్కొన్నాడు. ఇక హారిక ఇలా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదని…. ఇదంతా గ్రూప్ పాలిటిక్స్ లో భాగంగా జరుగుతోందని తాను అనుకుంటున్నట్లు కుమార్ సాయి తెలిపాడు. అలాగే ఇంటిలో ఫేక్ సంబంధాలు గురించి మాట్లాడిన అతను మనకి తెలియకుండానే ఎన్నో గేమ్ ప్లాన్ లు నడుస్తున్నాయని చెప్పాడు.