Kushi: శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన “ఖుషి” సినిమా నేడు విడుదలయ్యింది. విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించిన ఈ సినిమా మొదటి రోజు పరవాలేదు అనేటాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మొట్టమొదటి ఇంటర్నెట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ ఫుల్ కామెడీతో ఉండగా సెకండాఫ్లో భావోద్వేగ కరమైన సన్నివేశాలు కొన్ని లెంత్ సన్నివేశాలు ఉండటంతో.. కాస్త బోరింగ్ గా ప్రేక్షకులు ఫీలయ్యారు. ఆచారాలు నమ్మే హీరోయిన్ కుటుంబం నాస్తిక వాదాన్ని నమ్మే హీరో కుటుంబం మధ్య నడిచే ప్రేమ కథను చాలా అద్భుతంగా వెండితెరపై డైరెక్టర్ శివ నిర్వాణ చూపించడం జరిగింది.
సినిమాలో విజయ్ దేవరకొండ ప్రభుత్వ ఉద్యోగిగా.. కాశ్మీర్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే సమంతా ని చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సినిమా మొదటి భాగంలో సమంత ప్రేమ పొందుకోవడానికి విజయ్ దేవరకొండ చేసే ప్రయత్నాలు వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. రాహుల్ రామకృష్ణ తో సన్నివేశాలు సైతం చాలా అద్భుతంగా వెండి తెర మీద పండటం జరిగింది. సినిమా ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను చూసే రీతిలో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో సాంగ్స్ మరియు సమంత ఇంకా విజయ్ దేవరకొండ లుక్స్ ఎంతగానో ఫ్రెష్ గా అనిపించాయి.
సెకండాఫ్ కొద్దిగా మైనస్ అయినా గాని ఫస్ట్ ఆఫ్ తోపాటు.. క్లైమాక్స్ సినిమాకి అతిపెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. రెండో భాగంలో సమంత తండ్రి మురళి శర్మ నటన.. కామెడీ బాగా ఆకట్టుకునే రీతిలో శివ నిర్వాణ పాత్రను తీర్చిదిద్దడం జరిగింది. దీంతో వరుస పరాజయాలతో ఉన్న విజయ్ దేవరకొండ కి ఖుషి సినిమా అతిపెద్ద హిట్ గా నిలిచింది. అన్ని వర్గాలు చూసే సినిమాగా కామెడీ తో పాటు ఎమోషనల్ సన్నివేశారులతో సింపుల్ లవ్ స్టోరీ తో అద్భుతంగా చిత్రీకరించారు.