Kushi: వరుస పరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ… సమంతాకి “ఖుషి” రూపంలో బ్లాక్ బస్టర్ రావటం తెలిసిందే. ఈ సినిమా విజయంతో ఎక్కువగా విజయ్ దేవరకొండ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాదాపు హిట్ అందుకుని మూడు సంవత్సరాలకు పైగా.. కాలం గడవడంతో.. “ఖుషి” విజయం సాధించటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సినిమాకి ముందు సమంత నటించిన “యశోద”, “శాకుంతలం” రెండు అట్టర్ ప్లాప్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో “ఖుషి” విజయంతో సమంత కూడా చాలా సంతోషంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి తారీకు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అంతేకాదు విడుదలైన మూడు రోజుల్లోనే 70 కోట్లు క్రాస్ చేసి చరిత్ర సృష్టించింది. కచ్చితంగా త్వరలో ₹100 కోట్లు కూడా క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విజయ్ దేవరకొండ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా “ఖుషి” రికార్డు సృష్టించింది. ఇలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఇప్పుడు హైలెట్ గా మారాయి. మేటర్ లోకి వెళ్తే సినిమాలో హీరో విప్లవ్.. హీరోయిన్ ఆరాధ్య జాతకాలలో నాడీ దోషం ఉందని పెళ్లి జీవితం సాఫీగా సాగదని పిల్లలు పుట్టారని ఆరాధ్య తండ్రి గొడవ పెట్టడం తెలిసిందే. అయితే జాతకాలు దేవుళ్ళు నమ్మని హీరో తండ్రి ఆ విషయాన్ని చాలా లైట్ తీసుకోవడం జరుగుతుంది. సినిమాలో సీన్ పరిస్థితి ఇలా ఉంటే ఇది స్క్రిప్ట్ పరంగా కాదని నిజంగా సమంత జాతకంలో చోటు చేసుకున్న విషయాన్ని ఓపెన్ గా డైరెక్టర్ శివ నిర్వాణ తెరపై చూపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
మేటర్ లోకి వెళ్తే సమంత నాగచైతన్య జాతకంలో కూడా ఇదే దోషం ఉందని.. అందువల్లే వారి ఇద్దరు విడిపోయినట్లు టాక్. అయితే దోషం విషయంలో ప్రత్యేక పూజలు చేయాలని సమంతా పై బలవంతం చేస్తే ఆమె ఒంటిగ వ్యవహరించడంతో.. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి.. ఆ కారణంగానే విడాకులు తీసుకున్నారని అదే ఖుషిలో చూపించారని.. అంటున్నారు. సినిమాలో దోషం కాన్సెప్ట్ సమంత వాస్తవ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలేనని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ ఇప్పుడు చర్చనీయాంశంగా ట్రెండింగ్ గా మారింది.