Kushi: దాదాపు మూడు సంవత్సరాల నుండి ఒక హిట్టు లేక నిరాశలో ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి సినిమాతో అదిరిపోయిన విజయం సొంతం చేసుకోవడం జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సింపుల్ లవ్ స్టోరీ తో అద్భుతమైన కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు భావోద్వేగకరమైన సన్నివేశాలు.. బాగా ఆకట్టుకున్నాయి. ఆచారాలు నమ్మే కుటుంబం ఇంకా నాస్తిక కుటుంబం మధ్య అద్భుతమైన ప్రేమ కథను నడిపించిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు సమంత లుక్స్ సినిమా చూసే ప్రేక్షకులను.. ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు రెండు సన్నివేశాలు గురించి సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆ రెండు సీన్ ల వల్లే “ఖుషి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని అంటున్నారు. ఆ రెండు ఏమిటంటే సమంత విజయ్ మధ్య కెమిస్ట్రీ రొమాన్స్ సన్నివేశాలు, ఇంటర్వెల్ తోపాటు కామెడీ వల్ల సినిమా విజయం సాధించిందని “ఖుషి” చూసిన ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఎక్కడా బోర్ కొట్టకుండా కుటుంబ ప్రేక్షకులు కూడా చూసే విధంగా.. శివ నిర్వాణ అద్భుతంగా తెరకెక్కించినట్లు చెప్పుకొస్తున్నారు.
అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు దాదాపు 20 నిమిషాలు ఉంటాయని అదే సినిమాకి కొద్దిగా మైనస్ అయిందని మరోపక్క టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పాజిటివ్ టాక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫ్రెష్ రొమాంటిక్ జోనర్ లో “ఖుషి”.. సినిమా ఉందని మెజారిటీ ఆడియన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక చాలాకాలం తర్వాత విజయ్ దేవరకొండ కి హిట్టు పడటంతో.. ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.