Ameer Khan: ఆఖరికి అమీర్ ఖాన్ అభిమానులు పండగ చేసుకొనే రోజు రానే వచ్చింది. అభిమానులే కాకుండా యావత్ సినిమా ప్రేక్షకులు అందరూ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూసారు. ఎట్టకేలకు అమీర్ – కరీనా కపూర్ ‘3 ఇడియట్స్’ తర్వాత మరోసారి కలిసి పని చేసారు. విడుదలైన ట్రైలర్ లో ఈ జంట మధ్య వున్న అందమైన కెమిస్ట్రీ అలరిస్తోంది. ఇక అక్కినేని నాగచైతన్యకు ఇది పర్ఫెక్ట్ బాలీవుడ్ డెబ్యూ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చైతూ పాత్ర కూడా ఇందులో ఎంతో ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోంది. ‘లాల్ సింగ్ చద్దా’ ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Ameer Khan: ట్రైలర్ ఎలా ఉందంటే?
ఈ ట్రైలర్ T20 ముగింపు మ్యాచ్ లో భారీ అభిమానుల సమక్షంలో టీవీక్షకులు వీక్షిస్తుండగా లాంచ్ కావడం విశేషం. ప్రపంచ టెలివిజన్ ప్లాట్ ఫారమ్ లో క్రీడా ప్రపంచం సాక్షిగా ఒక మూవీ ట్రైలర్ ను ఇంత గ్రాండ్ గా విడుదల చేయడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇక లాల్ సింగ్ చద్దా ట్రైలర్ విషయానికొస్తే, అభిమానుల్ని ఏమాత్రం నిరాశపరచలేదు. ట్రైలర్ ఆద్యంతం గుండెల్ని టచ్ చేసే ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంది. సినిమా అభిమానులను భావోద్వేగానికి గురి చేసేంత అద్భుతమైన కంటెంట్ ఇందులో ఉందని అర్థమైంది. పసిపిల్లాడి మనస్తత్వం ఉన్న పాత్రలో అమీర్ ఖాన్ ఒదిగిపోయాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తల్లి సెంటిమెంట్ సూపర్:
ఈ చిత్రంలో మోనా సింగ్ అమీర్ తల్లి పాత్రలో నటించారు. ఇందులో తల్లి సెంటిమెంట్ సూపర్ గా పండింది. అలాగే చిన్ననాటి ప్రియురాలితో కెమిస్ట్రీ కూడా బాగా చూపించారు. మంచు పర్వతాల్లో చిత్రీకరించిన ఈ చిత్రం భారతీయతను దేశభక్తిని ప్లెజెంట్ గా చూపించింది. సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత చాలా కాలానికి అమీర్ ఖాన్ – అద్వైత్ చందన్ ‘లాల్ సింగ్ చద్దా’ కోసం తిరిగి కలిసి పని చేశారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు – వయాకామ్ 18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!