NewsOrbit
సినిమా

ల‌క్ష్మీభూపాల్ ఇంట‌ర్వ్యూ

ఈ విజ‌యం వారికే అంకిత‌మిస్తున్నా

‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్‌. ఇటీవల విడుదలైన ‘ఓ బేబీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే, లక్ష్మీ భూపాల్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

– సాధారణంగా మీడియా ముందుకు రాని మీరు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం?

‘ఓ బేబీ’ విడుదల తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు సమంత నటన, నందినీరెడ్డి దర్శకత్వంతో పాటు నేను రాసిన మాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ఫోన్ చేసి అరగంటకు పైగా మాట్లాడారు. కెఎస్ రామారావుగారు ఫోన్ చేశారు. ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి ఎన్నో ఫోనులు వచ్చాయి. అందరికీ కృతజ్ఞత తెలపడానికి వచ్చాను.

– ‘ఓ బేబీ’ విజయం మీకు అంత ప్రత్యేకమా?

నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఒక 50, 60 సినిమాలు చేశా. అందులో కొన్ని విజయాలు ఉన్నాయి. ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలు చేసినా రాని శాటిశ్‌ఫ్యాక్ష‌న్‌ ‘ఓ బేబీ’కి వచ్చింది. మాటల గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగానూ సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నా చిన్నతనంలో మరణించారు. అప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మ సంరక్షణలో పెరిగాను. అందుకని, సినిమా కథ నాకు మరింత కనెక్ట్ అయింది. ఇందులో బేబీ పాత్రకు రాసిన ప్రతి మాట మా అమ్మ లేదా అమ్మమ్మ అన్న మాటలే. నేను చిన్నతనంలో ఎన్నోసార్లు విన్న మాటలే. ఉదాహరణకు… ‘మగాళ్లు అందరికీ మొగుడులా బతికా’ అని లక్ష్మిగారు ఒక సన్నివేశంలో డైలాగ్ చెబుతారు. నేనది అమ్మమ్మ నోటి నుంచి 150 సార్లు విని ఉంటాను. అందుకని, ‘ఓ బేబీ’ మాటల రచయితగా నా విజయాన్ని మా అమ్మ, అమ్మమ్మకు అంకితం ఇస్తున్నాను.

– సినిమా చూశాక, మీ అమ్మగారు ఏమన్నారు?

అమ్మ సినిమా చూసేటప్పుడు నేను పక్కనే కూర్చున్నాను. కొన్ని సన్నివేశాలు వచ్చేటప్పుడు నావైపు చూసేది. ఉదాహరణకు… చేపల పులుసు వాసన చూసి ఉప్పు సరిపోలేదని నేను చెప్పేస్తా. లక్ష్మిగారి పాత్రకు దాన్ని అన్వయిస్తూ సన్నివేశం రాశా. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అమ్మకు సినిమా బాగా నచ్చింది.

– కొన్ని ఘాటైన డైలాగులు కూడా రాశారు. మగాళ్లపై విమర్శ చేసినట్టున్నారు?

‘మొలతాడుకి, మోకాలి మధ్య కొవ్వు పెరిగిపోయి కొట్టుకుంటున్నారు’ డైలాగ్ గురించేనా? సినిమాలో నాగశౌర్య పాత్రను ఉద్దేశించి సమంతగారు ఆ డైలాగ్ చెప్పారని అనుకుంటున్నారు. సరిగా వింటే అందరినీ ఉద్దేశించి రాసిన డైలాగ్ అని తెలుస్తుంది. ప్రతివారం ఎక్కడో చోట చూస్తున్నాం లేదా వింటున్నాం. తొమ్మిదేళ్ల పాపపై అని, మరొకటి అని. అందుకే, ఆ మాట రాశా. సెన్సార్ వాళ్లకు భయపడి నేను చెప్పాలనుకున్న భావాన్ని పూర్తిగా కాకుండా, కొంచెం సుతిమెత్తగా రాశా. లేదంటే ఇంకా ఘాటుగా రాసేవాణ్ణి.

– కృష్ణవంశీ, నందినిరెడ్డి, సతీష్ కాసెట్టి… వీళ్లతో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు?

అవును. ఒక్కొక్కరితో మూడేసి సినిమాలు చేశా. ఇంకా చాలామందితో చేశా. తేజగారితో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి పేరు తెచ్చింది.

– స్టార్ హీరోల సినిమాలకు చేయకపోవడానికి కారణం?

కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, కుదరలేదు. రవితేజ ‘బలాదూర్’కి చేశాను కదా! బహుశా… నేను పంచ్ డైలాగులు, ప్రాసలకు దూరంగా ఉంటాను కనుక అవకాశాలు రాలేదేమో. స్టార్ హీరోలు, దర్శకులు అవకాశాలు ఇవ్వలేదేమో. నాకు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు చేయాలని ఉంటుంది. అవకాశం వస్తే… వాళ్ల బాలాలు చూపించేలా డైలాగులు రాయాలని ఉంటుంది. చిరంజీవిగారు ‘దొంగ మొగుడు’ వంటి సినిమా చేస్తే ఎంత హుషారుగా ఉంటుందో ఆలోచించండి. అవకాశాల కోసం చూస్తున్నాను. స్టార్ హీరోలతో పనిచేయలేదేమో గానీ… స్టార్ ప్రొడక్షన్ హౌసులు సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, ఉషాకిరణ్ మూవీస్ కి పని చేశా. నా ఫస్ట్ మూవీ ‘సోగ్గాడు’ సురేష్ ప్రొడక్షన్స్ సినిమా.

– సినిమాలు ప్లాప్ అయితే రైటర్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

నేను రైటర్ గా వర్క్ చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కానీ, రైటర్ గా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయితే తర్వాత మరో అవకాశం వచ్చేది కాదు కదా. ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి నేను లక్ష రూపాయల రెమ్యునరేషన్ పెంచేవాణ్ణి. కసితో రాసేవాణ్ణి.

– ప్రజెంట్ రైటర్స్ రెమ్యునరేషన్ ఎలా ఉంది?

బావుంది. హ్యాట్సాఫ్ టు త్రివిక్రమ్ గారు. ఆయన ఒక ప్యారామీటర్ సెట్ చేశారు. రైటర్ ఇంత తీసుకోవచ్చు, రైటర్ కి ఇంత ఇవ్వొచ్చు అని చూపించారు.

– ఇటీవల రచయితలు దర్శకులుగా మారుతున్నారు. మీరు?

కొందరు రచయితలు ఫ్ర‌స్ట్రేష‌న్‌లో దర్శకులు అవుతున్నారు. తాము రాసినది దర్శకులు సరిగా ఆవిష్కరించడం లేదనే కోపంలో దర్శకులుగా మారుతున్నారు. నేను ఫ్ర‌స్ట్రేష‌న్‌లో, కోపంలో దర్శకుడు కావాలని అనుకోవడం లేదు. నేను మాత్రమే కథకు న్యాయం చేయగలని భావించిన రోజున మెగాఫోన్ పడతా.

– మీ దగ్గర ఎన్ని కథలున్నాయి? అందులో మీరు మాత్రమే న్యాయం చేయగలిగినవి ఎన్ని?

నా దగ్గర మొత్తం 24 కథలున్నాయి. అందులో ఆరు కథలను నా కోసం పక్కన పెట్టుకున్నా. సతీష్ కాసెట్టికి ఒక కథ ఇచ్చాను. అలాగే, రచయితగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

author avatar
Siva Prasad

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Leave a Comment