డిజిటల్ మీడియా రెవల్యూషన్ చాలా వినోదాలను అందుబాటులోకి తెస్తుంది. ఎంటర్టైన్మెంట్ పరిధులు పెంచుతూ, సరికొత్త వినోదాలను పరిచయం చేస్తుంది. అలాంటి పీట్ అప్ ప్రెజెంట్స్ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్’ మంచు లక్ష్మీ హోస్ట్‌గా రాబోతున్న ఈ ఎంటర్టైన్మెంట్ షో అనుభవాలు మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ
“ఇప్పటి వరకూ నేను చేసిన షోస్‌లో ఈ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్‌ని కలిసి నైట్ డ్రెస్‌లో రమ్మంటే వారిలో కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్లో ఈ తరహా షోలు సాధారణ మే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షోతో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీలకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసాను చెదరనివ్వలేదు. ఈ షోకి వచ్చే స్టార్స్ చాలా ఇంటర్వ్యూలు, టాక్ షోలు, ఈవెంట్స్ లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారి లో ప్రతిరోజు ఎదో చేంజ్ వస్తుంది. వారి మాటలు, అనుభవాల్లో నుంచీ వస్తాయి. ఉదాహరణకు సమంత గురించి మనకు చాలా తెలుసు అనుకుంటాం.. కానీ తను నాగ చైతన్య గురించి ఈ షోలో మాట్లాడిన విషయాలు మీకు సర్ప్రైజ్గా ఉంటాయి. వరుణ్ తేజ్ ఈ షోలో కొత్తగా కనబడతాడు. చాలా బాగా వచ్చింది ఆ ఎపిసోడ్. వచ్చిన వాళ్ళందరూ ఈ షోని బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ అభిమానులకు మరింత దగ్గర అవుతారు. ఈ షో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ వేలో వెళుతుంది. ఈ షో తప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ ఎపిసోడ్స్ ఈ నెల23 ప్రతి సోమవారం ఈ షోను ఎంజాయ్ చేయవచ్చు“ అన్నారు.
previous post
next post