వేడి తగ్గుతుంది వర్మ

ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులు రిలీజై దారుణమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టంతా వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పైనే పడింది. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచిన వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రొమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. వర్మ, తన సినిమాని ప్రమోట్ చెయ్యడంలో ఎప్పుడూ ముందుంటుడూ కానీ సినిమాల్లోనే అసలు విషయం ఉండదని సినీ అభిమానులు అనుకుంటున్నాను. అయితే మాములు సినిమాలు ఏమో కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలని క్యాష్ చేసుకోని వర్మ వీలైనంత తొందరగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదల చేస్తాడనుకుంటే, లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకి టైం చాలా తక్కువగా ఉంది, ఎలెక్షన్ కోడ్ వస్తే వర్మ సినిమా విడుదలకి అడ్డంకులు తప్పవు. అది జరగకుండా ఉండాలంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చ్ రెండు లేదా మూడో వారంలో విడుదల చేయాలి. మార్చ్ నెలలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకపోతే జూన్ వరకూ ఆగాల్సి వస్తుంది. ఒక్కసారి ఎలెక్షన్స్ అయిపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదల చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. ఇది అలోచించి వర్మ వీలైనంత త్వరగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తెస్తే మంచిది.