Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” దెబ్బకి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రేక్షకుల్లో ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు గురించి సినిమాల గురించి మాట్లాడుకునే వారు. కానీ బాహుబలి సినిమా ఎప్పుడైతే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను పగలగొట్టడం జరిగిందో అప్పటినుండి… ఇండియన్ సినీ లవర్స్ ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ కథల గురించి హీరోల గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల కంటే ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎక్కువగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు మరియు డైరెక్టర్లు ఆరాటపడుతున్నారు. పరిస్థితి ఆ విధంగా “బాహుబలి” దెబ్బకి మారిపోయింది. ఇదిలా ఉంటే గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ప్రభాస్ కి స్టోరీ చెప్పి ఒప్పించలేకపోయారని డైరెక్టర్ల లిస్టు తాజాగా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read More: Prabhas : ప్రభాస్ లేకుండా ఆ సినిమా షూటింగ్ జరుగుతందా..?
దాన్ని బట్టి చూస్తే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒక పాన్ ఇండియా స్టోరీ ప్రభాస్ కి చెప్పడం జరిగిందట.. రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. అదే రీతిలో తెలుగులో సుకుమార్, కొరటాల శివ, పరుశురాం, తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజు, సుధా కొంగర.. వీరంతా గడచిన రెండేళ్ళ కాలంలో ప్రభాస్ కి స్టోరీ వినిపించారట కాని ప్రభాస్ కి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు సరికొత్త లిస్ట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులు లెక్క చూస్తే.. రాధాకృష్ణ దర్శకత్వంలో రాదే శ్యాం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో..సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్.. చేస్తున్నారు.