Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల ఫ్రెండ్ షిప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. ఒకరు మనసు అయితే ఇంకొకరు తనువు అన్నట్టుగా వ్యవహరిస్తారు ఇద్దరూ. బేసిగ్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మిత్రులు చాలా తక్కువమంది వుంటారు. వారిలో మన మాటల మాంత్రికుడు చాలా ముఖ్యమైనవాడు. పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినకపోయినా త్రివిక్రమ్ మాట వింటాడు అని బయట అంటూ వుంటారు. ఇక తమ స్నేహ బంధం గురించి వీరిద్దరూచాలా సందర్భాల్లో బాహాటంగానే చెప్పుకొచ్చారు కూడా.
Pawan Kalyan : పవర్ స్టార్ తో సినిమా చేస్తే అంతేమరి.. దెబ్బకి భీమ్లానాయక్ డైరెక్టర్ దశ తిరిగింది!
Pawan Kalyan: అసలు విషయం ఇదే:
ఇక గురువారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన త్రివిక్రమ్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్ కి పవన్ కి ఒక్క విషయంలో తేడా వచ్చేస్తుంది. అవే పుస్తకాలు. అవును.. దొందూ దొందే. పుస్తకం ఒకసారి పట్టుకున్నారంటే ఇక అది పూర్తయేవరకు వదిలి పెట్టరు. ఈ క్రమంలో జరిగిన ఓ విషయమే పవన్ చెప్పుకొచ్చారు.
Pawan kalyan : 2022 సంక్రాంతికి పవన్ – రానాల ఏకే రీమేక్..?
అది అస్సలు ఇవ్వరట?
పవన్ మాట్లాడుతూ… “మా ఇద్దరమూ, పుస్తకం పురుగులమే.. నా దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒకటి అతడికి నచ్చి ఇవ్వమని అడిగితే మాత్రం నేను అస్సలు ఇవ్వలేను. కావాలంటే తనకి ఒక సినిమా అయినా ఫ్రీగా చేస్తాను కానీ పుస్తకాన్ని మాత్రం ఇవ్వడానికి నాకు మనస్కరించదు!” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.