Pooja Hegde: పొడుగుకాళ్ల సుందరి పూజ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. బేసిగ్గా ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సౌత్ అమ్మాయిలు హీరోయిన్లుగా వెలుగొందుతున్నవేళ, నార్త్ అమ్మాయి అయినటువంటి ఈ ముద్దుగుమ్మ జెట్ స్పీడుతో దూసుకెళ్లడం మనం చూస్తున్నాం. తాజాగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్ రిలీజై అభిమానుల అంచనాలను అంతగా అందుకోలేకపోయింది. తొలి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత పూర్తిగా డీలా పడిపోయింది.
Pooja Hegde-Prabhas: ప్రభాస్‌తో మరో సినిమా.. ఓపెన్ అయిన పూజా హెగ్డే!
Pooja Hegde: బాలీవుడ్ వసూళ్లు ఎలా వున్నాయంటే?
మన తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. పూర్తి ప్రేమకథ చిత్రమైనప్పటికీ ఒక్క యాక్షన్ ఎలిమెంట్ కూడా లేకపోవడం, అలాగే రియాలిటీకి కాస్త దూరంగా ఉండటం వలన ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఫలితం గురించి పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాట్లాడింది.
Pooja Hegde: `రాధేశ్యామ్` ఫ్లాప్ టాక్.. వైరల్‌గా పూజా హెగ్డే రియాక్షన్!
పూజ జోస్యం ఇదే…
పూజ మాట్లాడుతూ… “కొన్ని సినిమాలు మనకు యావరేజ్ అనిపించినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురుపిస్తాయి. మరికొన్ని మనకు ఎంత బాగా నచ్చినా రిజల్ట్ అనుకున్నట్లు ఉండకపోవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది. అలాగే జరుగుతుంది. రాధేశ్యామ్ విషయంలో కూడా అదే జరిగింది. బాక్సీఫీస్ వద్ద సినిమా తలరాత మారిపోతుంది అని బలంగా నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది.”