RRR : RRR రిలీజుకి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి వుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో NTR మాట్లాడుతూ “మల్టీస్టారర్ చిత్రాలంటే ఒకప్పుడు బోలెడు క్యాలిక్యులేషన్స్ ఉండేవి. హీరోల క్రేజ్‌ను బట్టి సీన్లు, డైలాగ్‌లు, పంచ్‌లు, ఫైట్స్ ఎన్ని ఉండాలి అని ఒకప్పుడు లెక్కలు వేసుకునేవారు. అభిమానులు కూడా అవే కోరుకునేవారు. కానీ ఇపుడు కాలం మారింది. ప్రస్తుతం మన సినిమాలు ఆ స్థాయిని దాటి పోయాయి.” అన్నారు.
RRR: ఉక్రెయిన్ దేశం గురించి రాజమౌళి కీలక వ్యాఖ్యలు..!!
“ప్రస్తుతం నాకు తెలిసి లెక్కలేసుకుని సినిమాలు తీసే రోజులు ఎప్పుడో పోయాయి. అభిమానులు కూడా ఎడ్యుకేట్ అయ్యారు. సినిమాలు చూసే విధానం ఇపుడు మారిపోయింది. అభిమానులు NTRని, చరణ్ ని మాత్రమే కాదు, ఇద్దరినీ కలిపి ఒకే తెరపై చూడబోతున్నాం అని మానసికంగా సిద్ధమయ్యారు. ఈ రోజు మన దర్శకులు.. మన సినిమాలు.. మనం ఆ స్థాయిని దాటేసి ముందుకెళ్లామని నమ్ముతున్నాము.” అని అన్నారు.
RRR: ఉక్రెయిన్ ప్రజలకు అండగా RRR టీమ్?
రాజమౌళి ఇలా అన్నారు:
ఇక ఈ వేదికగా రాజమౌళిని.. NTR, రామ్‌చరణ్ బ్యాలెన్స్‌గా నటించారా? అని అడగగా “ఇద్దరికీ తెరపై నిడివి ఎంత ఉంది? ఆ హీరోకి ఎన్ని ఫైట్స్ ఉన్నాయి? ఈ హీరోకి ఎన్ని డైలాగులు ఉన్నాయి? ఎవరు ఎన్ని పంచ్ డైలాగులు వేశారు? ఇలాంటి లెక్కలు పక్కన పడేసి ఈ సినిమా తీశా. క్షణం కూడా ఆ విషయాల గురించి ఆలోచించలేదు. ఎక్కువగా నేను ఆలోచించింది ఏంటంటే.. ప్రేక్షకుల్లో ఇద్దరిపై ఒకే విధమైన ఎంపతీ రావాలి. ఇద్దరి గురించి ఒకేలా ఆలోచించాలి. ఒకేలా ఫీలవ్వాలి.” అని అన్నారు.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…