RRR: ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా RRR అనే వినబడుతోంది. అవును.. సినిమా రిలీజ్ దగ్గర పడటంతో RRR మానియా షురూ అయ్యింది. సినిమా మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ దూకుడు పెంచారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం RRR బృందం 4 రోజుల్లో భారతదేశంలోని 9 నగరాలను సందర్శించనుంది. మార్చి 18న ఈ టూర్ హైదరాబాద్‌లో ప్రారంభం కాగా, టీమ్ అదే రోజున దుబాయ్ లో ఓ ఈవెంట్‌ను నిర్వహించితిన్ విషయం తెలిసిందే.
RRR: విడుదలకు ముందే `ఆర్ఆర్ఆర్` ఖాతాలో మరో అరుదైన రికార్డ్!
RRR: ఇలా ప్రమోట్ చేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?
అవును.. మన జక్కన్న ఏం చేసినా అందులో క్రియేటివిటీ ఉండి తీరుతుంది. తాజా అప్డేట్ ఏంటంటే జక్కన్న తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి దేన్నీ వదిలి పెట్టడం లేదు. కెవాడియా, గుజరాత్ వంటి ప్రాంతాల్లో ప్రయాణించడానికి ఏకంగా ‘RRR’ బ్రాండ్ వున్న కార్లను తయారు చేశారు. ఇలా కార్లను కూడా ప్రమోషన్స్ కు ఉపయోగించుకుంటున్నాడు జక్కన్న. ఎంతైనా రాజమౌళి ప్రమోషన్స్ ప్లాన్స్ అదుర్స్ అంటున్నారు ఆయన అభిమానులు.
RRR: చాదస్తం ఎక్కువ నోరుపారేసుకుంటది..అంటూ ఆ టాప్ యాంకర్ పై ఎన్టీఆర్ కామెంట్స్..!!
మరింత సమాచారం:
నిన్న అనగా ఆదివారం బరోడాలో దిగిన ‘RRR’ త్రయం అక్కడ ప్రమోషనల్ ఈవెంట్లో పాలు పంచుకున్నారు. ఎప్పటిలాగే ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. ఈ క్రమంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి బరోడా, ఢిల్లీలను కవర్ చేసారు. ఇక త్వరలో మన హైద్రాబాద్‌లో జరగబోతున్న ఈవెంటుకు మన జక్కన్న ఎలాంటి ప్లాన్లు రెడీ చేస్తాడో వేచి చూడాలి మరి.