RRR: దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలను పోషించారు.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. టాక్ అదిరిపోవడంతో ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ బ్రేక్ ఈవెన్ దిగా దూసుకుపోతోంది. ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజైన సినిమాలన్నీ మళ్లీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ విడుదలైన మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ, అనుకున్న టైమ్ కంటే ముందే ఈ సినిమా వస్తుందట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ తెలుగు తమిళ మలయాళీ, తమిళ హక్కులను జీ 5 దక్కించుకుంది. హిందీ హక్కులను మాత్రం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
అయితే సౌత్ భాషల్లో రిలీజైన రెండు నెలల తర్వాత అంటే మే 25న ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు జీ 5 వారు అగ్రిమెంట్ చేసుకున్నారట. హిందీ వెర్షన్ మాత్రం నెటిఫ్లిక్స్‌లో 3 నెలల తర్వాత అంటే జూన్‌లోనే స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.