Chandramukhi 2: “చంద్రముఖి 2” ఈనెల 28వ తారీకు విడుదల కాబోతోంది. తెలుగు భాషకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. కంగనా… లారెన్స్ ప్రధానమైన పాత్రలు పోషించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా “చంద్రముఖి 2” తెలుగు భాషకు సంబంధించిన హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో లారెన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరియర్ లో డాన్స్ అనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక స్టైల్ పరంగా చూసుకుంటే రజిని సార్ నీ చూసి నేర్చుకోవడం జరిగింది. అందువలనే సహజంగా నడకలో రజిని సార్ స్టైల్ ఉంటుంది.
ఈ సినిమాలో నా నుంచి ఆ స్టైల్ వేరు చేయటానికి డైరెక్టర్ వాసు ట్రై చేసిన కుదరలేదు అని స్పష్టం చేశారు. ఇక కంగనాతో కలిసి సినిమా చేయబోతున్నట్లు తెలుసుకున్న తర్వాత చాలా సంతోషం అనిపించింది. అయితే సినిమా స్టార్టింగ్ లో సెట్ లోకి ఆమెతో పాటు గన్ మాన్స్ వచ్చారు. దీంతో నేను చాలా భయపడిపోయాను. కానీ ఆ తర్వాత ఆమెతో సానిహిత్యం పెరిగింది. ఇక తర్వాత మరో హీరోయిన్ మహిమ కూడా చాలా బాగా చేసింది. మహిమ పాటలు కూడా బాగా పాడుతుంది. ఆమె వాయిస్ విని నేనే పడిపోయానని లారెన్స్ పొగడ్తలతో ముంచెత్తారు.
ఇంత పెద్ద బ్యానర్ లో చేయటం వాసు గారు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు వంటి సీనియర్స్ తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కీరవాణి గారి సింప్లిసిటీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన మ్యూజిక్ గురించి తప్ప మరే దాని గురించి ఆలోచన చేయరు. అటువంటి కీరవాణి గారితో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది అని లారెన్స్ స్పష్టం చేశారు. అయితే ఇదే వేదికపై కంగనా.. మహిమా కలిసి స్టెప్పులు వేయటం అక్కడి వారందరికీ.. ఉత్సాహాన్ని కలిగించింది.