NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన చేసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తే.. మార్చి నెలలో పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఏప్రిల్ 5వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి పది రోజులు అవ్వకముందే సినిమాకి సంబంధించి షూటింగ్ ఫోటోలు లీక్ అయిపోయాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక లీక్ అయిన ఫొటో ఎన్టీఆర్ ఇద్దరు ఆర్టిస్ట్ లతో మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫోటో అని అర్ధమవుతోంది.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే నెలలో తారక్ పుట్టినరోజు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి టైటిల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దానికి ముందుగానే షూటింగ్ స్పాట్ లో ఫోటోలు బయటకు రావటం సినిమా యూనిట్ నీ కలవర పెడుతూ ఉంది. ఒక్క తారక్ షూటింగ్ మాత్రమే కాదు ఇటీవల ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల షూటింగ్స్ నుంచి ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ పరిణామంతో మేకర్స్ అలర్ట్ అయినట్లు సమాచారం. “NTR 30” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల కానుంది. “RRR” ప్రపంచ స్థాయిలో భారీ విజయం సాధించడంతో… ఈ సినిమా కూడా అదే రేంజ్ లో విజయం సాధించే విధంగా కొరటాల స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.
పైగా ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నారు. ఇది కూడా అదే రేంజ్ లో విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ తన కెరీర్లో 30వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేయటం జరిగింది. అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే మధ్యలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. సీన్ లోకి కొరటాల ఎంట్రీ ఇచ్చి.. తారక్ తో ప్రస్తుతం సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి అనురుధ్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు.
BREAKING: విడాకుల గురించి రిపోర్టర్ కి ఘాటు సమాధానం ఇచ్చిన సమంత..?