Liger: భారీ అంచనాల మధ్య ఆగస్టు 25వ తారీకు విడుదలైన “లైగార్” అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలలో ఉన్న తమ అభిమాన హీరో విజయ్ దేవరకొండకి “లైగార్” రూపంలో మరొక స్లాబ్రావడంతో ఫ్యాన్స్ ఫుల్ నిరుత్సాహం చెందారు. పూరి జగన్నాథ్ సినిమా కోసం పెద్దగా ఏమీ కష్టపడలేదని విమర్శలు కూడా చేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “లైగార్”.. అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో విజయ్ దేవరకొండ పడిన కష్టం తప్ప దర్శకుడిగా పూరి జగన్నాథ్.. ఏమాత్రం శ్రద్ధ పెట్టి సినిమా తీయలేదని చూసిన జనాలు అంటున్నారు.
ఈ సినిమా పరాజయంతో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ లో కొంత వెనక్కి ఇచ్చేయటం తెలిసిందే. ఇక పూరి కూడా చాలా నష్టాలను తానే భరించడం జరిగింది. “లైగార్” రిజల్ట్ ఎఫెక్ట్ తో.. పూరితో చేస్తున్నా రెండో సినిమా “జనగణమన” కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇదంతా పక్కన పెడితే “లైగార్” ఓటిటి రిలీజ్ అక్టోబర్ నెలలో అని మొన్నటిదాకా వార్తలు వచ్చాయి.
Liger: “లైగర్” నుండి మరో బిగ్ అప్ డేట్..!!
కాగా లేటెస్ట్ గా అనుకున్న సమయం కంటే ముందుగానే సెప్టెంబర్ 30 వ తారీకు “లైగార్”.. డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేయడానికి సినిమా యూనిట్ డిసైడ్ అయ్యిందట. త్వరలోనే అధికారికంగా ఈ తేదీ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు డైరెక్టర్ పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ సీక్వెల్ లో కొడుకు ఆకాష్ పూరినీ పెట్టీ సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఓటీటీలో “లైగర్” ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.