Liger: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటించిన “లైగర్”(Liger) ఆగస్టు నెలలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యి రెండు నెలలు కావస్తూ ఉంది. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ మొత్తం ఏప్రిల్ నెలలోనే కంప్లీట్ చేసేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. జులై పదవ తారీకు నుండి “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో డైరెక్టర్ పూరీ ఉన్నారు. ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సబ్జెక్ట్ డీల్ చేసిన సినిమా “లైగర్” కావటంతో.. సినిమా చూడటం కోసం సినీ ప్రముఖులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆసక్తిగా ఉన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక విజయ్ దేవరకొండ కెరియర్ ప్రస్తుతం వరుస ప్లాపులతో ఉండటంతో ఆశలు మొత్తం “లైగర్” పైనే పెట్టుకోవడం జరిగింది. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా… విజయ్ దేవరకొండ ప్రయాణం ఏంటి అనేది “లైగర్” లో చూపిస్తున్నట్లు.. సినిమాకి సంబంధించి విడుదల చేసిన వీడియోలు బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మైక్ టైసన్(Mike Tyson) పుట్టినరోజు కావడంతో… అతని పాత్రకు సంబంధించి చిన్నపాటి ఫోటో..షూటింగ్ స్పాట్ లో టైసన్ వర్కింగ్ వీడియోలు విడుదల చేశారు.
ఈ వీడియోలో పూరి, కరణ్ జోహార్, విజయ్ దేవరకోండ, ఛార్మి, అనన్యా పాండే..మైక్ టైసన్ కి బర్త్ డే విషేస్ తెలియజేశారు. ఈ క్రమంలో మైక్ టైసన్ సన్నివేశాలు మొత్తం పూర్తిగా అమెరికాలో చిత్రీకరించినట్లు వీడియో బట్టి ది;తెలుస్తోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ తో పాటు రమ్యకృష్ణ, ఆలీ మరికొంతమంది నటీనటులు నటించడం జరిగింది. పూరి జగన్నాథ్ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ సంయుక్తంగా కలిసి నిర్మించిన “లైగర్” ఆగస్టు 25వ తారీకు విడుదల కానుంది.