Entertainment News సినిమా

మరో చెత్త రికార్డు సొంతం చేసుకున్న “లైగర్”..!!

Share

వరుస పరాజయాలలో ఉన్న రౌడీ విజయ్ దేవరకొండ కి “లైగర్” రూపంలో మరో భారీ ఫ్లాప్ ఇటీవల పడిన సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. ఫస్ట్ టైం అటు విజయ్ దేవరకొండ కి ఇటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి “లైగర్” పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ క్రమంలో దాదాపు రెండు నెలలు సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేశారు. విజయ్ దేవరకొండ ఉత్తరాది మొదలుకొని దక్షిణాది వరకు ఎక్కడికెళ్లిన జనాలు తండోపతండాలుగా రావడం జరిగింది. దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండ కి భారీ క్రేజ్ ఉందని “లైగర్” ప్రమోషన్ల ద్వారా సినీ ప్రపంచానికి తెలిసి వచ్చింది.

Liger owns another worst record..!!

దీంతో ఇండియా ని షేర్ చేస్తామని సినిమా ప్రారంభం నుండి చెప్పడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తీరా సినిమా రిలీజ్ అయిన మొదటి షోకే అట్టర్ ప్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ నిరుత్సాహం చెందారు. “లైగర్” కోసం విజయ్ దేవరకొండ పడిన కష్టం సినిమాలో కనపడినా గాని డైరెక్టర్ పూరి పెన్ పవర్… టేకింగ్ ఎక్కడ కూడా కనిపించలేదని చూసిన జనాలు అంటున్నారు. హీరోగా విజయ్ దేవరకొండ న్యాయం చేసిన గాని డైరెక్టర్ పూరీ మాత్రం నిరాశపరిచారని చెప్పుకొస్తున్నారు.

Liger owns another worst record..!!

మొదటి రోజు నుండే పెద్దగా కలెక్షన్స్ రాకుండా ఉన్న “లైగర్”.. తాజాగా మరో చెత్త రికార్డు సొంతం చేసుకోంది. పూర్తి విషయంలోకి వెళ్తే “లైగర్” కి IMDB 10కి 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఈ ఏడాది విడుదలయ్యి ఫ్లాప్ లుగా నిలిచిన లాల్ సింగ్ చడ్డ 5, రక్షాబంధన్ చిత్రానికి 4.6, దొబార 2.9 రేటింగ్ ఇచ్చిన IMDB “లైగర్” కి 1.7 రేటింగ్ ఇవ్వడంతో ఈ ఏడాదిలో విడుదలైన అన్ని సినిమాలలో అతి తక్కువ రేటింగ్ దక్కించుకున్న సినిమాగా చెత్త రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది.


Share

Related posts

Nayanthara: వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌.. ప్రియుడికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన న‌య‌న‌తార‌!

kavya N

Shriya Sharma Black Dress Pictures

Gallery Desk

అఖిల్ కి పూజా హెగ్డే ఆ రకంగా ఉపయోగపడుతుందా …?

GRK