NewsOrbit
Entertainment News సినిమా

NTR: బాలకృష్ణ మాదిరిగా టాకీషో తో ఓటిటి లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న తారక్..!!

Share

NTR: ప్రజెంట్ ఓటిటి హవా నడుస్తోంది. ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమాల కంటే ఓటిటి రంగం వైపే ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారు. కరోనా రాకముందు ఓటిటి లలో కేవలం వెబ్ సిరీస్ ఇంకా చిన్న చిన్న సినిమాలు మాత్రమే విడుదల అయ్యే పరిస్థితి లేదు. కానీ కరోనా సమయంలో థియేటర్లు క్లోజ్ తో పాటు ప్రభుత్వ ఆంక్షలు కారణంగా 100% సిట్టింగ్ లేని పరిస్థితి కావడంతో చాలామంది నిర్మాతలు ఓటిటి రంగం వైపు మొగ్గుచూపటం జరిగింది. దీంతో ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు పెద్దపెద్ద సినిమాలు ఎక్కువగా ఓటిటి లలోనే విడుదలయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

Like Balakrishna, Tarak is going to enter OTT with a talk show

అంతేకాదు పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కూడా స్టార్ హీరోలు చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ “అన్ స్టాపబుల్” టాకీ షో…, నాగార్జున ఓటిటి బిగ్ బాస్ షో… ఇంకా పలు సింగింగ్ షోలు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటిటి టాకీ షోలో తారక్ కూడా ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన ఎన్టీఆర్ ఈ కొత్త టాక్ షోతో ఓటిటి లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మ్యాగజిన్ ఫిలిం ఫేర్ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Like Balakrishna, Tarak is going to enter OTT with a talk show

ప్రస్తుతం తారక కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. గతంలో ఎన్టీఆర్ … “మా” టీవీలో తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ లో హోస్ట్ గా చేయడం జరిగింది. ఆ తరువాత జెమినీ టీవీలో “మీలో ఎవరు కోటీశ్వరుడు”..అనే షో చేయడం జరిగింది. కాగా ఫస్ట్ టైం టాకీ షో ఓటిటిలో తారక్ చేయటానికి రెడీ అయినట్లు వార్త రావటంతో ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు.


Share

Related posts

Samantha – Tamannah: అందుకు సమంత, తమన్నా పనికిరారా..?

GRK

Radhe shyam: ట్రైలర్ బావుంది..కానీ మనవాళ్లకే అర్థమవడం లేదట..!

GRK

Harihara veeramallu : హరిహర వీరమల్లు లో పవర్ స్టార్ ఎన్ని గెటప్స్ లో కనిపించబోతున్నాడో చూడండి..!

GRK