RRR: ప్రపంచ స్థాయిలో భారతీయ చలనచిత్ర రంగ రూపురేఖలను మార్చేసింది “RRR”. ఈ ఏడాది ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. దర్శకుడు రాజమౌళి తీసిన విధానం దేశాలకు ప్రాంతాలకు అతీతంగా సినిమా ప్రేక్షకులను “RRR” ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తరువాత హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులను ఇంటర్నేషనల్ రేంజ్ లో చాలామందిని ఈ సినిమా ఆకర్షించడం జరిగింది. ఈ సినిమా చూసి అవతార్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళితో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియా సాక్షిగా తెలియజేయడం జరిగింది.
భారతీయ చలనచిత్ర రంగంలో ఏ సినిమా అందుకొని అనేక అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. “RRR” గెలుచుకున్న అంతర్జాతీయ అవార్డుల లిస్టు చూస్తే…ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు, 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డు, హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ క్రియేటివ్స్ ఆర్ట్స్ అవార్డు, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్, శాటర్న్ అవార్డ్, హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్, 88వ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కల్ ఫిల్మ్ అవార్డ్, ఆస్టిన్ ఫిల్మి క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్.
బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్, జార్జియా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్, నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్, అలయన్స్ ఆఫ్ ఉమెన్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అవార్డ్, ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్, సౌత్ ఈస్టర్న్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్. చాలా వరకు నాటు నాటు అవార్డులు రావడం జరిగింది. ఇదిలా ఉంటే “RRR”కీ సంబంధించి సెకండ్ పార్ట్ కూడా తీయబోతున్నట్లు రాజమౌళి తెలియజేయడం జరిగింది. ఇందుకు సంబంధించి కథ విషయంలో కొత్త ఐడియా వచ్చినట్లు అమెరికాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.