Samantha: ప్రస్తుత సమాజంలో సామాన్యుడితో పాటు సెలబ్రిటీల హెల్త్ కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కరోనా తర్వాత మనిషి ఆరోగ్యంతో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులతో చాలామంది క్షణాల్లో చనిపోతున్నారు. మరి కొంతమంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇటీవల హీరోయిన్ సమంత మయోసైటిస్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధికి గురికావడం తెలిసిందే. ఈ వ్యాధి తనకి వచ్చినట్లు స్వయంగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం అనేక సంచలనాలకు దారితీసింది.
అంతకుముందే సమంత వాళ్ళ చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. చర్మ సంబంధిత వ్యాధి ట్రీట్మెంట్ కోసం అమెరికాకి వెళ్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ టైంలో సమంత టీం వచ్చిన వార్తలను కొట్టి పారేశారు. అయితే ఈలోపే సమంత స్వయంగా మయోసైటిస్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు తెలపటం సంచలనంగా మారింది. ఇది అరుదైన వ్యాధి కావడంతో సమంతా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరోపక్క సినిమా సెలబ్రెటీలు సమంతాకి ధైర్యం చెప్పడం తెలిసిందే. అయితే ఈ రకంగా సమంతతో పాటు అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ లు లిస్టు చూస్తే చాలామంది ఉన్నారు.
గోవా బ్యూటీ ఇలియానా… డిమ్ మార్ఫిక్ డిజార్డర్ తో బాధపడుతోంది. ఇటీవల పెళ్లి చేసుకున్న హీరోయిన్ నయనతార స్కిన్ ఎలర్జీతో సతమతం అవుతుంది. ఇంకా పరిణితి చోప్రా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇద్దరు కూడా డిప్రెషన్ అనే వ్యాధితో పోరాడుతున్నారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో స్నేహ ఉల్లాల్, మానసిక ఆరోగ్య సమస్యలతో అనుష్క శర్మ.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటువంటి అరుదైన వ్యాధులతో… ఈ టాప్ మోస్ట్ హీరోయిన్స్ పోరాడుతున్నారు.