Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. వ్యక్తిగత లాభం కోసం కాకుండా ఇండస్ట్రీ ఎదగాలని ఆలోచించిన నిజమైన హీరో. ఆ రీతిగానే అప్పట్లో మొదటి కలర్ సినిమా ఇంకా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. హీరోగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సినిమా రంగంలో కౌబాయ్ ఇంకా జేమ్స్ బాండ్ లాంటి స్టోరీలతో తెలుగు సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని కలిగించారు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణ విజయవంతంగా రాణించారు.
తాను నటించిన సినిమా నిర్మాత నష్టాల్లో ఉంటే చాలా వరకు కృష్ణయే ఆ నష్టాన్ని భరించేవారు. ఇండస్ట్రీలో చాలామంది కృష్ణ నీ నిర్మాతల హీరోగా అభివర్ణించేవాళ్లు. సినిమా ఇండస్ట్రీలో కృష్ణ క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. దాదాపు 350 కి పైగా సినిమాలు చేశారు, 50 మల్టీస్టారర్ సినిమాలు చేయడం జరిగింది. 1983 వ సంవత్సరంలో కృష్ణ నటించిన ఆరు సినిమాలు విజయవాడలో… శత దినోత్సవాలు జరుపుకున్నాయి. కృష్ణా నటించిన 20 చిత్రాలు తమిళంలో డబ్ కాగా 10 చిత్రాలు హిందీలోకి అనువాదమయ్యాయి. దర్శకుడిగా 16 సినిమాలు చిత్రీకరించారు. 1972వ సంవత్సరంలో అత్యధికంగా 18 సినిమాల్లో నటించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో 31 సినిమాలు చేశారు.
కృష్ణతో కలిసి పనిచేసిన దర్శకుల సంఖ్య 105. సినిమా ఇండస్ట్రీలో 44 సంవత్సరాలు పాటు గ్యాప్ లేకుండా నటించిన ఏకైక హీరో కృష్ణ. కృష్ణ 44 ఏళ్ల సినీ కెరియర్ లో 30 సినిమాలు సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో దాదాపు 80 మంది హీరోయిన్లతో నటించిన ఏకైక హీరో కృష్ణ. కృష్ణా మరియు విజయనిర్మల కాంబినేషన్ లో 50 సినిమాలు వచ్చాయి. జయప్రద తో 45 సినిమాలు వచ్చాయి. కృష్ణ శ్రీదేవి కాంబినేషన్ లో 31 సినిమాలు రావడం జరిగింది. కృష్ణ డబల్ పాత్రలో 25 సినిమాలు చేశారు. కృష్ణ త్రిపాత్రబినయం చేసిన సినిమాలు ఏడు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్ హీరో కృష్ణ. తెలుగులో ఏ హీరోకి లేని రీతిలో కృష్ణకు అప్పట్లోనే 2500 కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. 79 సంవత్సరాల వయసున్న కృష్ణ ఈరోజు ఉదయం మరణించడంతో … అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఇంకా ఇండస్ట్రీ పెద్దలు శోక సంద్రం లోకి వెళ్ళిపోయారు.