సినిమా

‘లుకా చుప్పి’ మూవీ ట్రైలర్

Share

కార్తిక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌ జంటగా లక్ష్మణ్‌ ఉతేకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా లుకా చుప్పి. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రటీమ్. లుకా చుప్పి అంటే దాగుడుమూతలని అర్ధం. ఫ్యామిలితో కలిసి ఓ జంట లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్ చేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో, మొదట్లో లీడ్ పెయిర్ ఫ్యామిలిస్‌కు తెలియకుండా ఓ ఇల్లు తీసుకోని కృతి, కార్తిక్‌ భార్యాభర్తల్లా జీవిస్తుంటారు. ఈ క్రమంలోనే వీళ్ల విషయం ఇంట్లోవారికి తెలిసిపోతుంది. దీంతో నెక్ట్స్ ఏం జరగబోతుంది? కార్తీక్, కృతి కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? అన్నదే లుకా చుప్పి అసలు కథ. ట్రైలర్‌లో కార్తిక్‌, కృతి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది, ట్రైలర్ ఫన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ గా కట్ చేయడంతో ఈ మూవీ కోసం యూత్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

Rashmika Mandana Latest Photoshoot Pics

Gallery Desk

బిగ్ బాస్ 4 : ఈ ముగ్గురూ ఖచ్చితంగా లాస్ట్ రోజు వరకూ ఉంటారు ??

sekhar

Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. బిగ్ బాంబ్ పేల్చిన `ఆర్ఆర్ఆర్` బ్యూటీ!

kavya N

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar