నిధుల కోసం స్టార్ హీరోలని లైన్ లో పెడుతున్న మా అసోసియేషన్

Share

సినీ స్టార్స్ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు వస్తాయి అన్న మాట నిజమే సినీ తారలు ఇండియాలో ఈవెంట్ చేసిన ఇండియా బయట ఈవెంట్ చేసినా ఫ్యాన్స్ చూడటానికి టికెట్ కొనుక్కుని మరీ వస్తారు. అది సినిమా అయినా లేదా వాళ్ల ఈవెంట్ అయినా దీని క్యాష్ చేసుకోవడంలో విఫలమయింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తిరుమల ప్రొడక్షన్స్ తో కలిసి పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి తో అమెరికాలో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ తో వచ్చే ఫండ్స్ ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన సొంత భవనం కోసం కొంత అసోసియేషన్ పథకాల కోసం మరి కొంత డబ్బును ఉపయోగించనుంది కానీ ఈవెంట్ విషయంలో అవకతవకలు జరిగాయని మా సభ్యులు మధ్య చిచ్చు రాజేసింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో డైరీ ఆవిష్కరించిన పెద్దల కోరిక కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఒక సొంత బిల్డింగ్ ఉండాలి అనేది. సొంత భవనంతో పాటు ఈ సంవత్సరం నుంచి వృద్ధ ఆర్టిస్టులను ఇచ్చే పెన్షన్ డబ్బులు 5 వేలకు పెంచారు దీంతోపాటు కల్యాణ లక్ష్మి మా విద్యా పథకాలు కూడా ప్రవేశపెట్టింది మా అసోసియేషన్ ఇంత భారీగా పథకాలు మరియు సొంత బిల్డింగ్ కావలసినటువంటి నిధులను సమకూర్చే పనుల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా త్వరలో లండన్ లో భారీ ఈవెంట్ సెలబ్రిటీ స్టార్ హీరో నిర్వహించబోతున్నాం దాన్ని త్వరలోనే ప్రకటిస్తాం అని చెప్పారు. ముందుగా అనుకున్నట్టు సీనియర్ నరేష్ తన తమ్ముడు మహేష్ బాబుతో ఈవెంట్ ఉండబోతుంది అని అందరూ అనుకున్నారు కానీ మహేష్ బాబు ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని షాకిచ్చింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.

ఆ హీరో ఎవరు అనే చర్చ ఫిలిం నగర్ లోనీ గల్లీ గల్లీలో లొల్లి లా మారిపోయింది. అంత డబ్బు సమకూర్చాలంటే స్టార్ హీరో ఒక్కడే వెళ్తే సరిపోదు అతనితోపాటు మరికొంత మంది నటీనటులు కూడా వెళ్లవలసిన అవసరం ఉంటుంది అని చెప్తుండగా మరికొంతమంది ఆ స్టార్ హీరో పేర్లు కూడా చెప్పేస్తున్నారు ఇప్పటికే యూరోప్ లో టూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పనులు చక్కదిద్దడానికే వెళ్ళాడు అని గుసగుసలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి దీంతో పాటు మరికొంతమంది స్టార్ హీరో పేర్లు కూడా తమ ఫ్యాన్సు చేసుకుంటున్నారు నాగార్జున వెంకటేష్ బన్నీ తో పాటు యూత్ లో రౌడీ ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించడం మొదలయ్యింది. అంతే మరి సో మొత్తానికి మా అసోసియేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు అంతటి నిధులు సంపాదించి పెట్టే స్టార్ హీరో ఎవరు అనేది వేచి చూడాల్సి ఉంది.


Share

Related posts

Maa: టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలో ఎన్నికలు..??

sekhar

హాట్ ఫొటోలతో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న మెగా బ్యూటీ..!

Teja

ఎన్టీఆర్‌కి జోడి దొరికిందా?

Siva Prasad

Leave a Comment