ఈరోజు జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందు నరేష్ ఓటుతో ప్రారంభమైన ఎన్నికలు చిట్టిబాబు ఓటు వేయడంతో ముగిసింది. ఎప్పుడూ లేని విధంగా 745 ఓట్లకు గానూ 473 ఓట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం మా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు ఫలితం వస్తుంది. సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం శివాజీరాజా, నరేష్ మధ్య పోటీ జరుగుతుంది. ప్రధాన కార్యదర్శి పదవికి జీవిత రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ఎవరు విజేత అనేది తెలియాలంటే 8 గంటల వరకు ఆగాల్సిందే…
previous post