మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్(మా) పాలక వర్గం ఎన్నికలు నేడు ఫిలించాంబర్‌లో స్టార్ట్ అయ్యింది. ఈరోజు మధ్యాహ్నం 2గంటల వరకు జరుగుతుంది. గత ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన శివాజీరాజా, కార్యదర్శిగా పోటీ చేసిన నరేష్ మధ్య ఈ సారి అధ్యక్ష పదవికోసం పోటీ జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సాధారణ ఎన్నికలను తలపించేలా ఈసారి మా ఎన్నికలు జరుగుతుండటం విశేషం. 785 సభ్యులు మా ఎన్నికల్లో ఓటును వినియోగించుకోనున్నారు.
నరేష్ వర్గం తరపున కార్యదర్శి పదవికి నటి జీవిత పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో శివాజీ రాజా వర్గానికి సపోర్ట్ చేసిన మెగా బ్రదర్స్ నాగబాబు ఈసారి తన మద్ధతు నరేష్ ప్యానెల్‌కు ఉంటుందని తెలియజేశారు. నరేష్ ప్యానెల్లో అంతా కొత్తవారు పోటీ చేస్తుండటం.. మహిళలకు పెద్ద పీట వేయడంతో తన మద్ధతును వారికి తెలియజేస్తున్నానని అన్నారు నాగబాబు.
శివాజీరాజా ఆల్రెడీ ఓసారి మా అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ నరేష్ అధ్యక్షుడిగా తనకు ఓసారి అవకాశం ఇవ్వాలని.. ఇస్తే తాను గత పాలక వర్గం చేయలేని పనులను చేస్తానని. గతసారి కార్యదర్శిగా తాను చాలా కృషి చేశానని.. ఆ రిపోర్టుల ప్రకారం తాను మా అభివృద్ధికి పాటు పడతానని నరేష్ అంటున్నారు.
చిరంజీవి, నాగార్జున, సాయిధరమ్ తేజ్, సునీల్ ఇలా.. తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
previous post
next post