MAA: మంచు విష్ణు ప్రమాణ స్వీకారానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ గైర్హజరు..! మెగా బ్రదర్స్ కూడా..!!

Share

MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కొద్ది సేపటి క్రితం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. మంత్రి తలసాని సమక్షంలో విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ విష్ణు ప్యానెల్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు గైర్హజరయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే విష్ణు ప్రమాణ స్వీకారం చేయకముందు రెండు రోజుల క్రితమే అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. తొలి సంతకంగా సభ్యుల పెన్షన్ ఫైలుపై సంతకం చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రతినిధులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

MAA president manchu vishnu oath ceremony
MAA president manchu vishnu oath ceremony

 

MAA: మంత్రి తలసాని సమక్షంలో విష్ణు ప్రమాణం

కార్యక్రమంలో పద్మశ్రీ మంచు మోహన్ బాబు, సినీ ప్రముఖులు శివకృష్ణ, నరేశ్, సి కల్యాణ్ తదితరులు హజరైయ్యారు. మెగా కాంపౌండ్ నుండి ఎవరూ హజరు కాలేదు. కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, నందమూరి బాలకృష్ణ తదితర పలువురు సినీ ప్రముఖులను స్వయంగా ఆహ్వానించిన మంచు విష్ణు.. మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మాత్రం మంచు మనోజ్ నిన్న భీమ్లానాయక్ సెట్లో వెళ్లి కలిశారు. దాదాపు గంట సేపు టాలివుడ్ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తొలుత మంచు విష్ణు కుటుంబ సమేతంగా ఫిలింనగర్ లోని దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రమాణ స్వీకారానికి దూరంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్

ఇదిలా ఉంటే మా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రతినిధులు ఆరోపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఎన్నికల రోజు సీసీ పుటేజీ ఇవ్వాలని కోరుతూ ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు లేఖ రాశారు. దీంతో సీసీ పుటేజీ వచ్చిన తరువాత ప్రకాశ్ రాజ్ ప్యానెల్ న్యాయమైన చర్యలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సీసీ పుటేజీలో వయిలేషన్స్ ఏమైనా కనబడితే దాన్ని బట్టి హైకోర్టును ఆశ్రయించాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటుంటారని అంటున్నారు. అయితే ఇప్పటికే నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసి ఉండటం వల్ల కోర్టుకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అన్నవాదనలు వినబడుతున్నాయి. పోటీపోటీగా జరిగిన ఈ ఎన్నికల నేపథ్యంలో మా సభ్యులు రెండుగా చీలిపోయినట్లు స్పష్టం అవుతోంది. ఓ వర్గం మొత్తం విష్ణు ప్రమాణ స్వీకారానికి దూరం ఉండటం, మా లో విబేదాలు తారా స్థాయిలోనే ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయని సినీవర్గాల టాక్.


Share

Related posts

తప్పులు మీద తప్పులు..! పవన్ కి పార్టీ నడపడం తెలిసేదెన్నడు..!?

Srinivas Manem

Janasena – TDP: జనసేన – టీడీపీ స్ట్రాటజీ..! జగన్ ఓటమి కోసం ఇన్ని ప్రయత్నాలా..?

Srinivas Manem

Health Tips: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఏదైనా తినండి కానీ .. ఇవి మాత్రం తినద్దు , తరవాత బాధ పడతారు !

bharani jella