Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా హీరోలలో అన్ని రకాల పాత్రలు చేస్తూ.. విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో సినిమాలు చేస్తున్నాడు. మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ నీ బ్యాలెన్స్ చేసే విధంగా వరుణ్ ప్రాజెక్టులు ఒప్పుకుంటున్నారు. అంతేకాదు సీనియర్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా ఉత్సాహపడుతూ ముందుకొస్తున్నాడు. ఈ రీతిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ తో…F2, F3 సినిమాలు చేయడం తెలిసిందే.
ఈ రెండు సినిమాలలో వరుణ్ తనదైన శైలిలో కామెడీ పండించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైమానిక దళం నేపథ్యంలో సాగే ఈ స్టోరీ కి సంబంధించి శక్తి ప్రతాప్ సింగ్ అనే దర్శకుడుతో కలిసి పని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ .. పక్కన హీరోయిన్ గా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించనుందట. భారత వైమానిక దళానికి చెందిన అభినందన్ వర్థమాన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఈ మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ చేస్తున్న సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ సినిమా అయినా వెంటనే వైమానిక దళం పాన్ ఇండియా ప్రాజెక్ట్… స్టార్ట్ చేయడానికి వరుణ్ తేజ్ రెడీ అవుతున్నారు.