నితిన్ కొత్త సినిమా “మాచర్ల నియోజకవర్గం”. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి “రారా రెడ్డి” సాంగ్ లో … నితిన్ మొదటి సినిమా “జయం” లో “రాను రాను అంటూనే చిన్నదో” సాంగ్ బిట్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తుంది. అయితే ఇదే బిట్ సాంగ్ నీ ఇటీవల మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట”లోని సాంగ్ “మ మ మహేషా” వీడియో సాంగ్ లోని మహేష్ బాబు మాస్ డాన్స్ కు నితిన్ తాజా పాట బిట్ కలపటం జరిగింది. ఈ వీడియో ఓ నేటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సామాన్య నటించిన అభిమానులు… నితిన్ పాటకి సరిగ్గా మహేష్ స్టెప్పులు వేస్తున్నాడు అంటూ వీడియో ఎడిటర్ ని పొగుడుతున్నారు.
పాటకి డ్యాన్స్ సరిగ్గా సింక్ అయిందని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో పై నితిన్ స్పందిస్తూ వావ్.. సూపర్ గా సింక్ అయిపోయింది పర్ఫెక్ట్ గా ఉందని అన్నారు. “మాచవరం నియోజకవర్గం” సినిమాలో రారా రెడ్డి పాటలో ఈ బిట్టుకి.. హీరో నితిన్ తో పాటు అంజలి,.. స్టెప్పులు వేయడం జరిగింది. యూట్యూబ్ నీ ఈ సాంగ్ షేక్ చేసి పడేస్తుంది. డైరెక్టర్ ఎం రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో.. హీరో నితిన్ ఐఏఎస్ పాత్రలో కనిపిస్తున్నారు.
స్టేజ్ పైన అందరూ ఉండగానే నితిన్ పై అమ్మ రాజశేఖర్ సీరియస్ కామెంట్స్..!!
ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు మరియు పాటలు.. ఎంతగానో ఆకట్టుకున్నాయి. నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. సాగర్ మహతి ఈ సినిమాకి సంగీతం అందించారు. వచ్చే నెల 12వ తారీకు “మాచర్ల నియోజకవర్గం” సినిమా రిలీజ్ కానుంది. దీంతో ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నారు.