ఇద్ద‌రు స్టార్స్‌తో…


వైవిధ్య న‌టుడు మాధ‌వ‌న్ ఇప్పుడు ఒక ప‌క్క న‌టుడు, మ‌రో ప‌క్క ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తారు. ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డ్ గ్ర‌హీత, ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్ `రాకెట్రీ: ది నంబి నారాయ‌ణ‌న్ ఎఫెక్ట్‌`లో మాధ‌వ‌న్ టైటిల్ పాత్ర‌ధారిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ఆయ‌నే మెగాఫోన్ ప‌ట్టారు. లెటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్స్ న‌టించ‌బోతున్నారు. ఆ ఇద్ద‌రు ఎవ‌రో కాదు.. ఒక‌రేమో షారూక్ ఖాన్‌.. కాగా మ‌రొక‌రు సూర్య‌. ఓ కీల‌క పాత్ర కోసం షారూక్‌, సూర్య‌ను న‌టించాల‌ని మాధ‌వ‌న్ కోర‌గా.. ఇద్ద‌రూ ఓకే అన్నార‌ట‌. అయితే ఇక్క‌డొక చిన్న మెళిక ఉంది. బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ హిందీలో ఆ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంటే.. సూర్య ద‌క్షిణాదిన ఆ కీల‌క పాత్ర‌లో న‌టిస్తార‌ట‌. ఏదైతేనేం మాధ‌వ‌న్ కోసం ఇద్ద‌రు స్టార్స్ న‌టించ‌డానికి ముందుకు రావ‌డం గొప్ప విష‌య‌మే క‌దా!