ఇప్పుడున్న పాపులర్ కథానాయికలో ఒకరైన కీర్తీ సురేశ్ నాయర్ తన నటనతో దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటుందీ ముద్దుగుమ్మ. నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాతవాసి, రెమో, సామీ 2, సర్కారి వారి పాట, మిస్ ఇండియా లాంటి సినిమాలతో కుర్రకారు మనసును కొల్లగొట్టింది ఈ అందాల రాక్షసి. ఇవన్ని సినిమాలు అన్ని కలిసి ఆమెకు ఒక మంచి గుర్తింపు తెస్తే… ఒక్క మహానటి సినిమాతో కోట్లాది మంది ప్రజల గుండెల్లో చొరబడింది ఈ నటి. ఈ సినిమాతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో నిలిచింది ఈ భామ. ఆ సినిమాతో ఎన్నో అవార్డులను సైతం తన కైవసం చేసుకుంది. జాతీయ అవార్డును సైతం తన సొంతం చేసుకుంది. ఎంతో మంది అభిమానుల ప్రేమను పొందింది.
కాని ఈ సినిమా తర్వాత మాత్రం అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత ఈ మహానటికి సినిమా అవకాశాలు వచ్చినా అవేవీ తనకు సక్సెస్ ను ఇవ్వలేక పోయాయి. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇలా చాలా మంది హీరోలకు, హీరోయిన్లకు ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక భారీ హిట్ కొట్టిన తర్వాత ఖచ్చితంగా వారికి ప్లాఫ్ లు ఎదురుకావాల్సిందే.. ఇలా జరిగిన వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారిలో ప్రభాస్ నటించి పెద్ద హిట్ సంపాధించుకున్న భాహుబలి ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిన విషయమే..
కాని దాని తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేక పోయాయి. కాగా ఎన్టీఆర్ నటించిన సింహాద్రి ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.. కాగా ఆ సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాలు అంతగా ఆడలేదనే చెప్పుకోవచ్చు. ఇలా భారీ హిట్ కొట్టిన తర్వాత ఎందుకు ప్లాఫ్ లు అందుకుంటున్నారనీ అనుకోవచ్చు. దానికి కారణం లేకపోలేదు. ఒక భారీ సినిమా వచ్చిన తర్వాత వారు సినిమాల ఎంపికలో కన్ఫూజన్ అవడమే ఇందుకు కారణ మంటున్నారు పలువురు నిపుణులు.
ఎన్ని సినిమా ఆఫర్లు వచ్చినా వారు కథలను ఎంపిక చేసుకోవడంలో ఫేయిల్ అవడం మూలంగానే భారీ ప్లాఫ్ లు కూడా అందుకుంటున్నారని పలువురు అనుకుంటున్నారు. వీరిలాగే కీర్తి సురేశ్ కూడా కథల ఎంపికలో క్లారిటీగా ఆలోచించకపోవడం మూలంగానే ప్లాఫ్ లను చవిచూడాల్సి వస్తుందని భావిస్తున్నారు. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేశ్ తీసిన సినిమాలు ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయాయి. కాగా ఆ తర్వాత ఆమె సినిమాలు కూడా తీసిందా అని ఆశ్చర్యపోతున్నారు పలువురు. ఆమె సినిమాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియడం లేదంటున్నారు. ఇప్పటికైనా కథల ఎంపికలో క్లారిటీ లేకుంటే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో మెలుగగలదా అని పలువురు భావిస్తున్నారు.