అదుగో పులి అంటే… ఇదుగో తోక అనే చందాన తయారైంది మహర్షి పరిస్థితి. మహేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలవుతుందని యూనిట్ ప్రకటించింది. అయితే ఈ మధ్య సినిమా జూన్‌కి వాయిదా పడుతుందని వార్తలు వినిపించాయి. తర్వాత సినిమా ఆలస్యం కాదు.. ఏప్రిల్ 25నే విడుదల అంటూ మళ్లీ ప్రకటన వచ్చింది. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కి సమయం పడుతుందని, కాబట్టి సినిమాను వాయిదా వేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని మళ్లీ వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈసారి సినిమాను జూన్‌లో కాకుండా మే 9న విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారం.
మహేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న `మహర్షి`ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దిల్‌రాజు, అశ్వినీదత్, పివిపి సినిమాను నిర్మిస్తున్నారు.
previous post
next post