ఒక్కసారి ఇచ్చిన మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్… సీఎం భరత్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎంతో ఇంటెన్సిటీతో చెప్పిన ఈ డైలాగ్, భరత్ అనే నేను సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, ఇచ్చిన మాట పైన నిలబడడం లాంటి విషయాలని చాలా గట్టిగా చెప్పిన మహేశ్ బాబు… భరత్ అనే నేను నుంచి మహర్షికి మారగానే మాట తప్పుతున్నాడు.
ప్రస్తుతం పొల్లాచి షెడ్యూల్ కి ప్రిపేర్ అవుతున్న మహేశ్ అండ్ టీమ్, ముందుగా చెప్పిన టైమ్ ప్రకారం మహర్షి సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రావాలి. అయితే ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో మహర్షి సినిమాని వాయిదా వేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన దిల్ రాజు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కన్నా లాస్ట్ వీక్ లో అయితేనే మహేశ్ బాబుకి బాగా కలిసొస్తుందని అందుకే మహర్షిని ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేస్తామని చెప్తున్నాడు. కథలో దమ్ము ఉండాలే తన సినిమాని వర్కింగ్ డేస్ కూడా రిలీజ్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేయగల సత్తా ఉన్న మహేశ్ బాబు, మంచి టైం కోసం వెయిట్ చేయడం అనేది వినడానికి కామెడిగానే ఉంది. అసలు మహర్షి ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే… షూటింగ్ లో జాప్యం. అనుకున్న టైంకి షెడ్యూల్స్ పూర్తి కాకపోవడం, అమెరికా షెడ్యూల్ లో కొంచెం ప్యాచ్ వర్క్ బ్యాలన్స్ ఉండడం మహర్షి సినిమా వాయిదా పడడానికి అసలు కారణాలు.
రిలీజ్ డేట్ ఏప్రిల్ 5 అని ఫిక్స్ అయిన ఘట్టమనేని అభిమానులు, సోషల్ మీడియాలో 100 డేస్ కౌంట్ డౌన్ కూడా మొదలెట్టారు. ఇప్పుడు మహర్షి డిలే అయ్యింది అనే వార్తలు బయటకి రావడంతో మహర్షి మాట తప్పాడంటూ అదే సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 5 నుంచి తప్పించిన మహర్షిని 26న విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి కానీ ఆ రోజు కూడా మహేశ్ బాబు రావడం కష్టమే. అన్ని అనుకున్నట్లు జరిగితే మే రెండో వారంలో కానీ మహర్షి పూర్తిగా సిద్దమై ప్రేక్షకుల ముందుకి రాదు. మరి హాట్ సమ్మర్ లో వచ్చే సూపర్ స్టార్ కూల్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.