Pawan Mahesh: తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేతగా తెలుగు చలనచిత్ర రంగంలో అనేక సినిమాలు చేయటం జరిగింది. తొలుత ప్రారంభంలో యువత మరియు కుటుంబ నేపథ్యం కలిగిన సినిమాలను దిల్ రాజు ఎక్కువగా తెరకెక్కించేవారు. ఆ తర్వాత కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి దిగిన డీల్ రాజు వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుని.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. నిర్మాతగా జర్నీ స్టార్ట్ చేయకముందు నైజాం డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వారి లాభాలు సాధించడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై దిల్ రాజు వైరల్ కామెంట్స్ చేశారు. మేటర్ లోకి వెళ్తే 2017 సంవత్సరంలో పవన్ “అజ్ఞాతవాసి”, మహేష్ “స్పైడర్” ఈ రెండు సినిమాల నైజాం రేట్స్ కొనుగోలు చేశాను. నా కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డామేజ్. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకుని… ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు.

కానీ అదే ఏడాదిలో నిర్మాతగా 6 హిట్స్ కొట్టడంతో నిలబడగలిగాను అని దిల్ రాజు చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు.. సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. “RRR” తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా “వారసుడు” అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రెండు వచ్చే ఏడాది భారీ ఎత్తున రిలీజ్ కానున్నాయి.