మహేష్ 26వ చిత్రం ఈ ఏడాదిలో జూలై ప్రారంభం కానుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో మహేష్ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. అందుకోసం మహేష్ డైలాగ్స్ కూడా రాయలసీమ యాసలోనే ఉంటాయి. అలాగే మహేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కూడా కనపడబోతున్నారట. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ను కాస్త కామెడీ యాంగిల్లో టచ్ చేస్తూ దర్శకుడు అనీల్ రావిపూడి డిజైన్ చేస్తున్నాడట. హీరో మహేష్ హిమో ఫోబిక్గా కనపడతారు. అంటే రక్తాన్ని చూస్తే భయపడే పాత్ర. మరి పోలీస్ ఆఫీసర్, రక్తాన్ని చూస్తే భయపడితే ఎలా ఉంటుందో.. అందులో నుండి ఎంత కామెడి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరి మహేష్‌ను ఓ డిజార్డర్ ఉన్న ఆఫీసర్‌గా చూపిస్తే.. ఆయన అభిమానులు ఒప్పుకుంటారో లేదో చూడాలి.
previous post
next post
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!