సినిమా

Mahesh Babu: హిట్ ఇచ్చిన ఆ డైరెక్ట‌ర్‌కు మ‌హేష్ మ‌ళ్లీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌?!

Share

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ అనంత‌రం మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ చిత్రం చేయానున్నాడు.

అయితే తాజాగా మ‌హేష్ బాబు లైన‌ప్‌లో మ‌రో ద‌ర్శ‌కుడు వ‌చ్చి చేరాడ‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.. ఇప్ప‌టికే మ‌హేష్ తో `సరిలేరు నీకెవ్వరు` సినిమా చేశాడు. 2020లో వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

అయితే హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడికే మ‌హేష్ బాబు మ‌రోసారి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని టాక్ న‌డుస్తోంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు. ఇటీవల మహేష్‌ కి తాను ఒక కథను చెప్పడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయిందనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అనిల్ పేర్కొన్నారు.

ప్రస్తుతం మహేష్ బాబుకి ఉన్న కమిట్మెంట్స్.. అనిల్ రావిపూడికి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే వీరిద్ద‌రి కాంబో సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంద‌ని అంటున్నారు. కాగా, అనిల్ రావిపూడి ఇప్పుడు విక్టరీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో క‌లిసి `ఎఫ్ 3` చేస్తున్నాడు. దీని త‌ర్వాత ఆయ‌న బాల‌య్య‌తో ఓ మూవీ చేయ‌బోతున్నాడు.


Share

Related posts

ఫ్యాన్స్ కి సర్‌ప్రజ్ ఇవ్వబోతున్న టాలీవుడ్ హిరోలు ..!

GRK

Anaswara Rajan Joshful Looks

Gallery Desk

Mahesh – Trivikram: మహేశ్ అభిమానులను టెన్షన్ పెడుతున్న త్రివిక్రమ్ ఫార్ములా..!

GRK