12న మ‌హేశ్‌, బ‌న్నీ ఢీ


సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓకేరోజున బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్నారు. మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` అని అంటుంటే.. బ‌న్నీ `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. నిజానికి బ‌న్నీ సినిమా జ‌న‌వ‌రి 12న వ‌స్తుంటే.. మ‌హేశ్ సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వినిపించాయి. కానీ తీరా రెండు సినిమాలు ఒకే రోజున ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. మ‌రి రెండు సినిమాలు ఎలాంటి ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకుంటాయో వేచి చూడాలి.