Mahesh Babu: స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రంలో మహేష్ బాబు..??

Share

Mahesh Babu: మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరియర్లో పౌరాణిక సినిమా ఏది చేయలేదు. కౌబాయ్ తరహాలో సినిమా చేసిన.. తర్వాత మిగతా అన్ని కమర్షియల్ అదే తరహాలో ప్రయోగాత్మక చిత్రాలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో మహేష్ బాబు “ప్రతాపరుద్రుడు” అనే టైటిల్ పేరిట పౌరాణిక సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే మహేష్ బాబు తో ఒక్కడు, సైనికుడు అదే రీతిలో అర్జున్ సినిమాలు డైరెక్టర్ గుణశేఖర్ చేయడం జరిగింది. వీటిలో “ఒక్కడు” మైల్ స్టోన్ సినిమాగా ఇండస్ట్రీలో నిలిచిపోయింది.

Gunasekhar wants to direct Mahesh Babu?

ఇదిలా ఉంటే ఈ చారిత్రాత్మకమైన ప్రతాపరుద్రుడు సినిమా స్టోరీని.. పౌరాణిక తరహాలో మహేష్ తో చేయాలని గుణశేఖర్ స్క్రిప్టు మొత్తం డిజైన్ చేసినట్లు త్వరలోనే మహేష్బాబుకి వినిపించి ఓకే చేయించే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. గతంలో రుద్రమదేవి సినిమాలో వాస్తవానికి అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర ముందు మహేష్ బాబుకి చెప్పినట్లు ఆయన నో అని చెప్పటంతో తర్వాత బన్నీ కి చెప్పి గుణశేఖర్ చేయించుకోవడం జరిగింది.

Read More: Mahesh Babu: ఆరు నెలలోనే మహేష్ సరికొత్త ప్లాన్.. అభిమానులకు ఇక పండగే??

ఇప్పుడు ఇదే రీతిలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ తరహాలోనే “ప్రతాపరుద్రుడు” స్టోరీ ఉండటంతో మహేష్ బాబు తో సినిమా చేయాలని గుణశేఖర్ రెడీ అవుతున్నట్లు టాక్. ప్రస్తుతం సమంతతో చేస్తున్న శకుంతల.. రానా తో చేస్తున్న సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించే ఆలోచనలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరి పౌరాణిక సినిమాకి మహేష్ ఒప్పుకుంటారో లేదో చూడాలి.


Share

Related posts

Varshini Soundarajan New HD Looks

Gallery Desk

గ్లాస్ వ‌స్తువుల‌పై క‌రోనా 28 రోజుల వ‌ర‌కు ఉంటుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..

Srikanth A

ఇంస్టా మరియు ట్విట్టర్ లోని పోస్ట్ లను డిలీట్ చేసిన స్టార్ హీరోయిన్!! ఆందోళనలో ఫ్యాన్స్!!

Naina