Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుసపెట్టి మూడు బ్లాక్ బస్టర్ విజయం సాధించినా మహేష్ బాబు ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో బిగ్ ప్రాజెక్ట్ చేయమన్నారు. అయితే రాజమౌళి సినిమా కంప్లీట్ అవ్వాలంటే మినిమం చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో మధ్యలో.. త్రివిక్రమ్ తో మహేష్ సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా సరికొత్త టాక్ వినపడుతోంది.
ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో..తెరకెక్కించాలని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. పొలిటీషియన్ బ్యాక్ డ్రాప్ లో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు .. సంజయ్ దత్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సరి కొత్తగా ఈ సినిమాలో రామ్ చరణ్ 30 నిమిషాల పాత్ర చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
త్వరలోనే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. మహేష్ తో రామ్ చరణ్ చేయబోయే ఈ సినిమాలో పాత్ర .. సినిమాకి అత్యంత కీలకం అంట. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ కి మొదటి నుండి మహేష్ బాబు తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ న్యూస్ నిజమైతే కనుక … మహేష్, చరణ్ అభిమానులకు పండగే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరో పక్క చూస్తే రామ్ చరణ్ వరుసపెట్టి ఇతర హీరోలతో సినిమాలు చేస్తున్నట్లు తాజా వార్తలు బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్ తో “ఆర్ఆర్ఆర్” ..చిరంజీవితో ఆచార్య .. శంకర్ తో చేయబోయే సినిమాలో పవన్ కళ్యాణ్ తో చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.