Mahesh-samantha: సమంత.. గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఏంటో ఎప్పుడో రుజువు అయిపోయింది. ఓ వైపు సినిమాలు మరో వైపు సమాజ సేవలో శామ్ ఎప్పుడూ ముందుంటుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత కూడా శామ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆమె మరింత ఉత్సాహంతో ముందుకు పోతోంది. ఇక ఇటీవల విడుదల అయిన పుష్ప ఐటమ్ సాంగ్ అయినటువంటి ‘ఊ అంటావా ఊఊ అంటావా’తో సమంత రేంజ్ మరో మెట్టు ఎగబాకింది.
Whatsapp: వాట్సాప్ యూజర్స్ కి మాత్రమే.. న్యూఇయర్ స్టిక్కర్స్ తో ఇలా రెచ్చిపోండి!
సమంత – మహేష్ జంటగా నటిస్తున్న సినిమా ఇదేనట!
ఇక ఉత్తరాదిలో నటించిన అమ్మడు సినిమా ‘ఫ్యామిలీమ్యాన్ 2’ సిరీస్ బాగా పాపులర్ అవడంతో ఈమె కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందనే చెప్పుకోవాలి. రాజీ అనే తీవ్రవాది పాత్రలో శామ్ ఇరగదీసింది. అందుకేనేమో ఇప్పుడు అగ్ర హీరోలు వరుసగా సమంతను తమ సినిమాల కోసం లాక్ చేస్తున్నారు. ఈ కోవలోనే మహేష్ సరసన సమంత నటించనుందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
Headache: ఈ జ్యూస్ తాగితే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం..!!
ఇక ఈ సినిమా ఎప్పుడు ఉండబోతుంది?
మొదట్లో త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమాకు పూజా హెగ్డే హీరోయిన్ అని అనుకున్నారు. ఇక ఈ సినిమా 2022లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తాజాగా పూజ ప్లేసులో శామ్ పేరు వినిపిస్తోంది. డేట్స్ సమస్య కారణంగా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ ప్లేసులో సమంతను ఎంపిక చేసుకున్నారని సమాచారం. విడాకుల తర్వాత సమంత ఓ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఈ వార్తే గాని నిజమైతే సమంత టాలీవుడ్లో మరలా చక్రం తిప్పడం ఖాయం అని కొందరు విశ్లేషకుల భావన.