Mahesh Babu: గత కొన్నాళ్లుగా ఇండియన్ సినిమా పరిశ్రమలో బొయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో అలనాటి నటుల నుండి రాజకీయ నేతలు, శాస్త్రవేత్తల వరకు ఇలా రకరకాల వ్యక్తుల జీవిత గాథలు అనేక సినిమాలు తెరకెక్కాయి. అలాగే ప్రస్తుతం అనేక సినిమాలు లైన్లో వున్నాయి. ఈ కోవలో స్పోర్ట్స్ బయోపిక్స్ అయితే ఎక్కువగా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఐతే ఈ తరహా చిత్రాలు ఎక్కువగా హిందీలోనే ఎక్కువగా వస్తున్నాయి. అడపాదడపా మన తెలుగులో కూడా వస్తున్నాయి. ఆమధ్య క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన NTR బయోపిక్ ‘కధానాయకుడు’ సినిమా వచ్చి నందమూరి అభిమానులను అలరించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్?
ఇక అనేక బయోపిక్కులు తెరకెక్కుతున్న క్రమంలో మన టాలీవుడ్ ప్రిన్స్ కి దానికి సంబంధించిన ప్రశ్న ఎదురయ్యిందట. అయితే దానికి అతను మిశ్రమంగా స్పందించారని వినికిడి. ఇక విషయంలోకి వెళితే, తాజాగా సర్కారు వారి పాట సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా మహేష్ ని ఓ విలేఖరి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ గురించి అడిగాడట. దానికి మహేష్ నిరాకరించినట్టు భోగట్టా. ఎందుకని అడగ్గా కృష్ణ గారి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయని, కొడుకుగా నేను చేసేకంటే, ఇంకెవరైనా చేస్తే బావుంటుందని అన్నాడట మన ప్రిన్స్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కారణం, బాలయ్యబాబు సినిమానేనా?
ఇక గతంలో బాలయ్య హీరోగా తన తండ్రి గారైనటువంటి సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కి, బక్షాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసినదే. ఈ కారణంగానే మహేష్ తన తండ్రి బయోపిక్ చేసే విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో మన తెలుగులో హిట్టైన బయోపిక్ సినిమాలు కూడా వున్నాయి. మహానటి సావిత్రి జీవిత కథ పెద్దగా అంచనాల్లేకుండా తెరకెక్కిన ఈ మహానటి సినిమా మంచి ఆదరణ పొందింది. ఈ ఊపులో వచ్చిన ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రెండు భాగాల సినిమా తీస్తే అవి కాస్త బోల్తా పడ్డాయి.