సినిమా

Mahesh Babu: యూఎస్‌లో మ‌హేష్ అరాచ‌కం.. మిగిలిన టాలీవుడ్ హీరోలు దిగ దుడుపేనా?

Share

Mahesh Babu: దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు `స‌ర్కారు వారి పాట‌`తో ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. `గోత గోవిందం`తో సూప‌ర్ పాపుల‌ర్ అయిన ప‌ర‌శురామ్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని చేశారు.

సంక్రాంతికే విడుద‌ల కావాల్సి ఉన్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వాయిదా ప‌డి చివ‌రాఖ‌ర‌కు మే 12న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయింది. భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అయిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దూసుకుపోతంది.

అందులోనూ యూఎస్‌లో మ‌హేష్ న‌యా క‌లెక్ష‌న్స్‌తో అరాచ‌కం సృష్టిస్తున్నాడు. తొలిరోజే 1 మిలియన్ డాలర్స్ మ‌ర్క్‌ను అందుకుని రికార్డు సృష్టించిన స‌ర్కారు వారి పాట‌.. రెండో రోజుకే ఏకంగా 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసేసిందట. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే సోమ‌వారం నాటికి 2 మిలియన్ డాలర్స్ మార్క్ కి చేరుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు.

కాగా, ఓవ‌ర్సీస్‌లో మ‌హేష్ మేనియా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాక్ ఎలా ఉన్నప్పటికీ అక్క‌డ ఆయ‌న‌కు చిత్రాల‌కు కలెక్షన్స్ మాత్రం వేరె లెవల్ లో వస్తూ ఉంటాయి. అది స‌ర్కారు వారి పాట‌తో మ‌రోసారి నిరూపిత‌మైంది. పైగా 1 మిలియన్ డాలర్స్ మ‌ర్క్‌ను అందుకున్న చిత్రాలు మ‌హేష్ ఖాతాలోనే ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ విష‌యంలో మాత్రం మ‌హేష్ ముందు మిగిలిన టాలీవుడ్ హీరోలు దిగ దుడుపే అని అంటుంటారు అభిమానులు.


Share

Related posts

Galli Sampath : ప్రీ రిలీజ్ బిజినెస్ లో దూసుకెళ్తున్న గాలి సంపత్ ..!! బ్రేక్ ఈవెన్ కి ఎంత కావాలంటే..!!

bharani jella

‘బ్రిటిష్’లో మంచి కూడా ఉంది.. ఎంతో నేర్చుకోవచ్చు: పూరి జగన్నాధ్

Muraliak

Anupama Parameswaran Beautiful Pics

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar