Mahesh: అభిమానులకు డబుల్ ధమాకా రెడీ చేస్తున్న మహేష్ బాబు..!!

Share

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి సంవత్సరం తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు అనగా మే 31 వ తారీకు కొత్త సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేయటం సెంటిమెంట్. గత ఏడాది “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నట్లు.. సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత అనేకమంది డైరెక్టర్ ల పేర్లు అప్పట్లో వినబడుతున్న సమయంలో మహేష్ వస్తున్న వార్తలకు తెరదించుతూ “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సినిమా కన్ఫామ్ చేశారు.

ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్

అయితే ఈ ఏడాది కృష్ణ పుట్టినరోజు నాడు ఎటువంటి సినిమా అప్డేట్ అవ్వలేదు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా మరణాలు సంభవించడం తో అప్పట్లో దేశంలో విషాదఛాయలు అలుముకున్న నేపథ్యంలో.. ఎటువంటి షూటింగ్ అప్డేట్ గాని.. వీడియో గాని రిలీజ్ చేయలేదు. ఈ పరిస్థితిలో ఉంటే త్వరలో మహేష్ పుట్టిన రోజు వస్తున్న నేపథ్యంలో ఈ సారి సినిమాకి సంబంధించి టీజర్ లేదా పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినబడుతోంది.

Read More: Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ క్రష్ హీరోయిన్ డీటెయిల్స్..!!

ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆరోజు సినిమాకి సంబంధించి ఏదో ఒకటి రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సరికొత్త బిగ్ సర్ప్రైజ్ ఇవ్వాలని డైరెక్టర్ పరశురామ్ డిసైడ్ అయినట్లు సమాచారం. అదే సమయంలో త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి కూడా మరో అప్డేట్ రానున్నట్టు టాక్. ఏది ఏమైనా తన పుట్టినరోజు నాడు అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. 


Share

Related posts

ఏపీ ఎమ్మెల్యేలను పట్టుకున్న కొత్త దిగులు ! ఏమిటో అది?

Yandamuri

Tata Safari :  టాటా సఫారీ మళ్ళీ అలరించనుందా ..!!

bharani jella

చిరంజీవి చెప్పారు..మేము తప్పక పాటిస్తాం…!!

DEVELOPING STORY