Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ఘట్టమనేని రమేశ్ బాబు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.. అన్నయ్య మృతి పై మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ తో స్పందించారు.. ఆయన ను అలా చూడలేకపోయాను అంటూ బాధపడ్డారు..
మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం.. నువ్వు లేకుంటే ఇప్పుడున్న నా జీవితానికి అర్ధం లేదు.. నాకోసం మీరు ఎంతో చేశారు.. నాకంటూ మరో జన్మ ఉంటే నేను నీకు తమ్ముడి గా పుట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.. ఇక మహేష్ కరోనా బారిన పడటం హోం క్వరెంటైన్ లో ఉండటం తో అన్నయ అంతిమ కార్యక్రమాలకు రాలేని పరిస్థితి.. మరోవైపు మహేష్ బాబు తన అన్నయను ఒక పెద్ద నిర్మాతగా చూడాలని ఆశ పడ్డారట. ఆ కోరిక తీరకుండానే తనను వదిలేసి కానరాని లోకాలకు వెళ్లిపోయారనీ సన్నిహితులు చెబుతున్నారు..