సూపర్ స్టార్ మహేష్ బావ సుధీర్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ గుర్తింపు తెచ్చుకోవటం జరిగింది. పర్ఫెక్ట్ బాడీ ఫిగర్ తో అదిరిపోయే స్టెప్పులు తో తనకు తగ్గ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించే సుధీర్ బాబుకి మహేష్ ఫ్యాన్స్ అండదండలు పుష్కలంగా ఉంటాయి. అదే రీతిలో మహేష్ బాబు పై ఎప్పటికప్పుడు సుధీర్ బాబు తన అభిమానాన్ని చాటుకుంటూ….. ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తూ ఉంటారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ నిరూపించుకున్న సుధీర్ బాబు తాజాగా “వి” అనే సినిమతో సెప్టెంబర్ మాసంలో ఓటిటి లో ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అయ్యారు. ఇటువంటి తరుణంలో సుధీర్ బాబు మహేష్ బాబుతో మల్టీ స్టారర్ సినిమా చేయాలని కామెంట్లు చేయడంతో ఇప్పుడు ఈ వార్త మహేష్ అభిమానులలో వాడి వేడి చర్చ కు తెరతీసింది. ఇంతకీ సుధీర్ బాబు చేసిన కామెంట్ ఏమిటంటే…. సూపర్ స్టార్ మహేష్ తో జీవితంలో ఒకసారైనా మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని, అలాగని పెద్ద రేంజ్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోయినా, చిన్న రోల్ లో అయినా నటించాలని సుధీర్ బాబు తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.
అంతేకాకుండా తక్కువ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎక్కువగా అలరించే హీరో మహేష్ అని కితాబిచ్చాడు. దీంతో ఎంతో ఫిట్ పైగా మంచి క్రేజ్ ఉన్న సుధీర్ బాబు…. మహేష్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా ఉంటే చేస్తాను అని తగ్గించుకుని మాట్లాడటంతో ఈ కారణానికి మహేష్ ఫ్యాన్స్ సుధీర్ బాబు అంటే మరింతగా ఫిదా అయి పడి చస్తున్నారు. నువ్వు చిన్న క్యారెక్టర్ కాదు… మహేష్ తో ఫుల్ లెంత్ క్యారెక్టర్ మల్టీస్టారర్ చేయాలని మరి కొంతమంది అభిమానులు కోరుతున్నారు.