Mahesh Pawan: పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్లు ఎలా సాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు అండి వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే… బాక్సాఫీస్ దగ్గర వాతావరణం వేరేలా ఉంటది. దాదాపు సినిమా రిలీజ్ నెల ముందు నుండే… సందడి సందడిగా ఉంటుంది. అటువంటిది ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వటానికి పరిస్థితులు షోరూమ్ కావటంతో ఇప్పటినుండే సోషల్ మీడియాలో.. ఇద్దరు హీరోల అభిమానులు నువ్వానేనా అన్నట్టుగా ఒకరికి ఒకరు హాష్ ట్యాగ్ లతో పోటీ పడుతున్నారు.
మేటర్ లోకి వెళ్తే 2022 సంక్రాంతి పండుగకు పవన్ “హరిహర వీరమల్లు“… మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమాకి సంబంధించి 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసినట్లు ఆ సినిమా నిర్మాత ఇటీవల తెలిపారు. మరోపక్క “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా చాలా శరవేగంగా సాగుతోంది. ఏది ఏమైనా వచ్చే సంక్రాంతి పండుగకు ఈ సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో… సోషల్ మీడియా లో ఇద్దరు హీరోల అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో పాటు మాష్ అప్ లతో రచ్చ రచ్చ చేస్తున్నారు.
Read More: Pawan Mahesh: బిజినెస్ లో కుమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..!!
ఇదే రీతిలో ఇటీవల హాష్ ట్యాగ్ లతో యుద్ధానికి సిద్ధమైన పరిస్థితి. ఇటీవల పవన్ అభిమానులు “హరిహర వీరమల్లు” అనే హాష్ ట్యాగ్ వైరల్ చేయగా… మహేష్ బాబు అభిమానులు దీనికి కౌంటర్ వస్తూ డోంట్ మేష్ విత్ ఏంబీ… అనే ట్యాగ్ లతో ప్రస్తుతం ఫైట్ కొనసాగిస్తున్నారు. ఇద్దరు హీరోల సినిమాలు రాకముందే సోషల్ మీడియాలో ఈ వాతావరణం నెలకొనడంతో సినిమాలపై పబ్లిసిటీ సోషల్ మీడియాలో గుట్టుచప్పుడు కాకుండా.. జరుగుతోంది.