HBD Rajamouli: భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పవచ్చు. ఆయన తీసిన “బాహుబలి” రెండు భాగాలు “RRR” సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో పాటు.. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబుతో నెక్స్ట్ సినిమా చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేసే రీతిలో ప్లానింగ్ చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో.. స్క్రిప్ట్ ఉండబోతున్నట్లు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది.
అంతేకాదు ₹1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నేడు రాజమౌళి పుట్టినరోజు కావడంతో మహేష్ బాబు ఇంటికి జక్కన్న ని పిలిపించి.. స్క్రిప్ట్ వివరాలు మొత్తం అడిగి తెలుసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇదే సమయంలో రాజమౌళి బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కూడా కట్ చేయించినట్లు చిన్న పార్టీ కూడా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే ఏడాది రాజమౌళి సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో మహేష్ బాబు ఇంటిలో రాజమౌళి బేటి అయినట్లు వచ్చిన వార్తలపై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కృష్ణ బర్తడే నాడు మే 31 వ తారీకు చేయాలని రాజమౌళి ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కృష్ణ బర్త్ డే.. మహేష్ కి సెంటిమెంట్ కావటంతో జక్కన్న ఈ రీతిగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.